Moviesవరుస సినిమాలు ఫ్లాప్.. కానీ కోట్లల్లో కూడబెట్టేస్తున్న విజయ్ దేవరకొండ..ఎలా..?

వరుస సినిమాలు ఫ్లాప్.. కానీ కోట్లల్లో కూడబెట్టేస్తున్న విజయ్ దేవరకొండ..ఎలా..?

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరో ..హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ రేంజ్ లో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ పేరు చెప్తే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. కాగా విజయ్ దేవరకొండ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా ఏది అంటే మాత్రం అర్జున్ రెడ్డి అని చెప్పక తప్పదు . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాల్లో నటించినా ఇలాంటి హిట్ అందుకోలేకపోయాడు . రీసెంట్గా గీతగోవిందం అదేవిధంగా ఖుషి సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు మారుమ్రోగిపోతుంది . విజయ్ దేవరకొండ లగ్జరీ లైఫ్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. అసలు ఆయన ఆస్తి ఎంత..? ఒక్కొక్క సినిమాకి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటాడు ..?అంటూ చర్చించుకుంటున్నారు .

విజయ్ దేవరకొండకు జూబ్లీహిల్స్ లో 15 కోట్లు విలువ చేసే బంగ్లా కూడా ఉంది అంటూ తెలుస్తుంది . ఇది ఒక లగ్జరీ భవనం .. ఇంట్లోనే గార్డెన్ కూడా ఉంది . సినీ పరిశ్రమలో మంచి నటుడుగా సక్సెస్ అయిన హీరో.. చాలా తక్కువ టైంలోనే విజయ్ దేవరకొండ ఇంత స్థాయికి ఎదగడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఈ స్టార్ హీరో మొత్తం ఆస్తి 95 కోట్లు ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండకు కార్లు అంటే మహా పిచ్చి.. ఆయన దగ్గర కాస్ట్లీ కాస్టలీ కార్లు కూడా ఉన్నాయట. రూ.65 నుంచి రూ.68 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు, 75 లక్షల విలువైన ఫోర్డ్ మస్టాంగ్ కారు, రూ. 64 లక్షల రేంజ్ రోవర్, రూ. 85 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సి 90 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాదు ఈ స్టార్ హీరో దగ్గర ఇవే కాకుండా ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉండడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news