సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రైవసీ అనేది అసలు కనిపించడం లేదు.. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసుల ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్ గా ఓపెన్ గా అందరికీ తెలిసిపోతుంది.. అఫ్ కోర్స్ ఎవరికైనా సరే తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ..కొన్ని కొన్ని విషయాలు నలుగురితో షేర్ చేసుకోలేరు.. అయితే స్టార్ సెలబ్రిటీస్ మాత్రం అలా షేర్ చేసుకోకపోయినా సరే ఆ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి ..ఎందుకు ఆ స్టార్ సెలబ్రిటీ ఇలా చేయడం లేదు ..?అలా చేయడం లేదు ..?అంటూ ప్రతి ఒక్కరు నిందించే వాళ్ళే.. మాట్లాడే వాళ్లే.. ఆమె పరిస్థితిని ఆయన పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్లే లేరు .
ఎవరి ఫ్యాన్స్ ఏ హీరోకి సపోర్ట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఆ హీరోని నెగిటివ్ గా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా డాటర్ శ్రీజ పేరు దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురవుతుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె మొదటి మాజీ భర్త మరణించడమే . శిరీష్ భరద్వాజను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . అయితే వాళ్ల విడాకులు తర్వాత ఆమె ఎప్పుడూ కూడా శిరీష్ భరద్వాజను కలిసింది లేదు. మరీ ముఖ్యంగా శిరీష్ భరద్వాజ్ కూడా తన కూతురిని సైతం దూరం పెట్టేసుకోవడం శ్రీజ మనసును బాగా హర్ట్ చేసింది .
కాగా రీసెంట్గా ఆయన లంగ్స్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అయ్యయ్యో పాపం అంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ ప్రార్ధించారు . కానీ శ్రీజ మాత్రం తన మాజీ భర్త పై ఎటువంటి పోస్ట్ చేయలేదు .. కేవలం శ్రీజానే కాదు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు . దీంతో మెగా హేటర్స్ సోషల్ మీడియాలో శ్రీజను ఆడేసుకుంటున్నారు . మీ కుటుంబానికి అంటే పడదు.. నువ్వు అతనిని ప్రేమించావు కదా ..అతనితో ఒక బిడ్డను కన్నావు కదా.. ఆ మాత్రం ప్రేమ లేదా..? ఆయన చనిపోతే ఒక్క పోస్టు పెట్టలేవా ..?అంటూ మండిపడుతున్నారు .
అయితే శ్రీజ పోస్ట్ పెట్టకపోవడానికి కారణం కూడా తన కూతురే అంటూ తెలుస్తుంది . శిరీష్ భరద్వాజ్ శ్రీజలకు పుట్టిన బిడ్డను విడిపోయిన తర్వాత శిరీష్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కలవలేదు ..అసలు ఆమెను తన బిడ్డగా కూడా అంగీకరించలేదు ..అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలా..? అంటూ మెగా ఫాన్స్ కూడా శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారు..!!