Moviesసౌందర్యకు ఆయన అంటే అంత ఇష్టమా ..,? కేవలం బ్రదర్ పెళ్ళికి...

సౌందర్యకు ఆయన అంటే అంత ఇష్టమా ..,? కేవలం బ్రదర్ పెళ్ళికి ఆ ఒక్క హీరోని పిలవడానికి కారణం అదేనా..?

సౌందర్య.. ఇండస్ట్రీలో ఓ టాప్ మోస్ట్ హీరోయిన్ .. ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నింది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆమెకంటూ స్పెషల్ ఇమేజ్ కూడా ఉంది . వల్గర్ పాత్రలో నటించదు .. బోల్డ్ డైలాగ్స్ చెప్పదు .. కానీ ఫ్యామిలీ పరంగా ఆడియన్స్ చూసే సీన్స్ లో నటిస్తుంది . చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . అంతే అందంగా చక్కగా అందరితో కలిసిపోతుంది .

అయితే దేవుడు ఆమె పాపులారిటీ సంపాదించుకోవడం జీర్ణించుకోలేకపోయినట్లు ఉన్నాడు చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయాడు. కాగా సౌందర్యకు సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట బాగా వైరల్ అవుతూనే ఉంటుంది . తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య కి సంబంధించిన మరొక మ్యాటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సౌందర్య తన బ్రదర్ పెళ్లికి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక హీరోని పిలవడం అప్పట్లో సంచలనంగా మారింది .

ఎస్ సౌందర్య తన బ్రదర్ పెళ్లిని దగ్గరుండి జరిపించింది . తన బ్రదర్ అంటే సౌందర్యకు చాలా చాలా ఇష్టం . సౌందర్య తన బ్రదర్ పెళ్లికి కేవలం వెంకటేష్ ని మాత్రమే ఆహ్వానించింది. దానికి కారణం కూడా ఉంది. ఆ టైంలో వీళ్ళు పెళ్లి చేసుకుందాం సినిమా షూట్ లో ఉన్నారు. అది బెంగుళూరులో జరుగుతుంది. అదే టైంలో వాళ్ల బ్రదర్ పెళ్లి జరగడంతో ఆయనను మాత్రమే ఇన్వైట్ చేసింది సౌందర్య . అయితే ఈ విషయం తెలియని కొందరు వెంకటేష్ కు సౌందర్య కు ఎఫైర్ ఉంది అంటూ రకరకాలుగా వార్తలు ప్రచురించారు. అఫ్కోర్స్ దానిపై అప్పట్లోనే క్లారిటీ ఇచ్చిన ఆ వార్తలకు మాత్రం చెక్ పడలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news