Movies"ప్రభాస్-అనుష్క ల పెళ్లి పై శ్యామలా దేవి సంచలన స్టేట్మెంట్".. ఫ్యాన్స్...

“ప్రభాస్-అనుష్క ల పెళ్లి పై శ్యామలా దేవి సంచలన స్టేట్మెంట్”.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిపోయిందిగా..!

సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే వార్త ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించి అని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు..? అంటూ కోట్లాదిమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు . అంతేకాదు ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది స్టార్ సెలబ్రిటీస్ కోరిక కూడా . అయితే ప్రభాస్ మాత్రం తన పెళ్లి విషయం దాటవేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న నా లైఫ్ లోకి స్పెషల్ కోసం రాబోతుంది అంటూ పోస్ట్ పెట్టాడు . దీనిని చూసిన అందరూ అనుష్క గురించి అంటూ మాట్లాడుకున్నారు . సీన్ కట్ చేస్తే అది కల్కి సినిమాలోని బుజ్జి పాత్ర కోసం అని క్లారిటీ వచ్చేసింది .

రీసెంట్గా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ ..శ్యామలాదేవి .. అనుష్కతో ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా బయటపెట్టింది . “చాలామంది అనుకుంటున్నారు ప్రభాస్ – అనుష్కల పెళ్లికి ఎవరో అడ్డుపడుతున్నారు అని .. అదంతా అబద్ధం.. ప్రభాస్ సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటాం..

ప్రభాస్ ఒకరిని బాధపెట్టే మనస్తత్వం కాదు .. ఆయనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని మేమే చెబుతున్నాం .. తన జీవితం తన ఇష్టం ..తను సంతోషంగా ఉండటమే మాకు కావాలి.. తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము.. ఇప్పటికే చెప్తున్నా తను ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తాము ..కానీ ప్రభాస్ మనసులో ఎవ్వరూ లేరు ఈ విషయం ఇప్పటికే మేము ఎన్నో సార్లు అడిగాం.. కాబట్టి పెళ్లి విషయంలో ప్రభాస్ కి పూర్తి ఇష్టాన్ని వదిలేస్తున్నాము” అని చెప్పుకొచ్చింది . దీంతో ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news