Moviesఉదయ్ కిరణ్ ని చూసి ఇప్పటి హీరోలు సిగ్గు తెచ్చుకోవాలా..? ఇకనైనా...

ఉదయ్ కిరణ్ ని చూసి ఇప్పటి హీరోలు సిగ్గు తెచ్చుకోవాలా..? ఇకనైనా ఆ పని చేస్తే బాగుపడతారా..?

ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు వాళ్ళ హీరోని పొగుడుకోవడానికి ఏ సమయాన్ని కూడా మిస్ చేసుకోరు ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా కొంతమంది హీరో ఫ్యాన్స్ చాలా చాలా జెన్యూన్ గా ఉంటారు ఎంతలా అంటే ఆ హీరోలు మన మధ్య లేకపోయినప్పటికీ చాలా చాలా ఇష్టంగా అభిమానిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఒక న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎలాంటి హై రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారో మనకు తెలిసిందే . ఒక్కొక్కరు 100 కోట్లు తీసుకుంటూ వస్తున్నారు . అయితే ఒకప్పటి హీరోస్ అలా కాదు.. కేవలం సినిమాకి పదివేలు 12000 తీసుకొని ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఉదయ్ కిరణ్ నటించిన “చిత్రం” సినిమాకి గాను ఆయన అందుకున్న పారితోషకం కేవలం 11000. కానీ ఈ సినిమా కలెక్ట్ చేసిన డబ్బులు మాత్రం ఏకంగా 12 కోట్లకు పైగా నే..

తనదైన స్టైల్ లో ఉదయ్కిరణ్ ఈ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమాని ఉషా కిరణ్ బ్యానర్స్ పై రామోజీరావు నిర్మించారు . ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది 30 లక్షలు ..కానీ రాబడిన వస్తువులు మాత్రం 12 – 13 కోట్లకు పైగానే . ఈ న్యూస్ నే ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు ఉదయ్ కిరణ్ అభిమానులు . ఎవరైనా సరే స్టార్ హీరో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ఎక్కువ లాభాలు వచ్చేలా సినిమా చేయండి చూద్దాం అంటూ ఓపెన్ సవాల్ విసిరుతున్నారు. ఆ విషయంలో నేటి కాలం హీరోస్ ఉదయ్కిరణ్ ని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news