టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మల్టీ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “మనమే”. ఈ సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన యంగ్ బ్యూటీ కృతి శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడిపోయాయి. ప్రతి దగ్గర కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి నుంచి శర్వానంద్ సినిమాలు అంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ అంటూ అందరూ చెప్పుకొస్తూ ఉంటారు .
ఈ సినిమా కూడా అంతే ..ఎక్కడ వల్గారిటీ లేదు ..ఎక్కడ అసభ్యకర పదాజాలం లేదు .. చాలా కూల్ గా.. క్లీన్ గా ఫ్యామిలీ అంతా వెళ్లి కలిసి ఎంజాయ్ చేసే మూవీ అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కృతిశెట్టి పర్ఫామెన్స్ కూడా హైలెట్ గా ఉంది అని ..తెరపై కృతి శెట్టి -శర్వా ల జంట బాగా అద్భుతంగా నటించారు అని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ పెడుతున్నారు . యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తనదైన స్టైల్ లో తెరకెక్కించారు . కొన్ని కొన్నిచోట్ల ఫ్యామిలీ లేడీస్ ఎలా ఇబ్బందులు పడతారు..? ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి..? అన్న విషయం కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
చిన్న బాబుకి తల్లిదండ్రులుగా శర్వానంద్ కృతి శెట్టి నటించిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది . అంతేకాదు కృత్తి శెట్టి ఈ సినిమాలో చాలా చాలా పవర్ఫుల్ పర్ఫామెన్స్ ఇచ్చింది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ చాలా పాతది.. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చూసాం.. కానీ శర్వానంద్ కృతి శెట్టి తమదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్లారు ..మరి ముఖ్యంగా కామెడీ టు గుడ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగోలేకపోయినా.. శర్వానంద్ ఎనర్జీతో కథను ముందుకు తీసుకెళ్లాడు . లండన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం మొత్తం కథ మొదలవుతుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోన్నప్పటికీ డైలాగ్స్ మాత్రం హార్ట్ టచింగ్ గా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కలలో నీళ్లు తెప్పిస్తాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??