కల్కి సినిమా పుణ్యమాంటూ ఇప్పుడు శంబల నగరం గురించి అందరూ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చాలా తక్కువ మందికే తెలిసిన ఈ శంబల నగరం ..ఇప్పుడు అందరూ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమానే.. ఈ కల్కి . జూన్ 27వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .
అయితే కల్కి సినిమాలో మనకి శ,బల నగరం చూపిస్తారు . ఇప్పుడు చాలామంది ఈ శంబల నగరం ఎక్కడ ఉంది..? అసలు దాని ప్రత్యేకత ఏంటి ,,> అని తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే శంబల నగరం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.హిందూ పురాణాల ప్రకారం విష్ణువు దశావతారాలలో కల్కి చివరి అవుతారం. దీని ఆధారంగానే కల్కి సినిమా తెరకెక్కించాడు కల్కి జన్మించబోయే పవిత్ర ప్రదేశమే ఈ శంబల నగరం . భూలోకంలో సంచరించే ప్రాంతం అంటూ చెబుతూ ఉంటారు . హిమాలయాలలోని అంతుచిక్కని ప్రదేశమే ఈ శంబల నగరం . శంబల అనేది ఒక సంస్కృత పదం షింగ్రిల్లా అంటూ ఉంటారు . భూలోక స్వర్గమని కూడా పిలుస్తూ ఉంటారు . అలాగే 13వ దలైలామా తన గురువు తాషిలామాతో కలిసి తాళపత్ర గ్రంధాలలో ఎన్నో రహస్యాలు దీని గురించి రాశారు. వీటిల్లో శంబలకు వెళ్లే దారి కూడా ఉండడం గమనార్హం హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాలలో ఒక రహస్య స్థావరం ఉంది .
అక్కడ చాలామంది మహర్షుల ధ్యానం చేస్తూ ఉంటారట . శంబలలో వయసుని స్తంభింప చేసే నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయట. పురాణాలు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఎవరెస్ట్ అడుగున ఒక సొరంగ మార్గం ఉంది ..దాని గుండా వెళ్తే గడ్డకట్టిన మంచు నది కూడా వస్తుంది. అక్కడ ఒక సొరంగం ఉంటుంది . దాన్ని దాటి వెళితే ఒక గుహ వస్తుంది. అక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారు మంచు కొండల మధ్యన స్పటిక పర్వతం.. శ్రీ చక్రం కనిపిస్తాయి ఈ స్పటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం సంబల అంటూ ఉంటారు.
అయితే 1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు అలాగే గూఢచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు . ఈ క్రమంలో వాళ్లు హిమాలయాల్లో చూసిన వింతలు అన్నిటిని ఒక నివేదిక తయారు చేశారు. భారతీయ సాంప్రదాయాలకు ముగ్గురు అయిన రోచయ్..ఆయన మరణించే వరకు కూడా శంబల నగరం గురించి అన్వేషిస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఇక రోచిత్ రాసిన పుస్తకంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకలించడమే అంటూ చెప్పుకొస్తారు .