Movies"సత్యభామ" మూవీ రివ్యూ: చించిపడేసిన కాజల్ అగర్వాల్.. అరాచకం సృష్టిస్తుంది భయ్యో..!

“సత్యభామ” మూవీ రివ్యూ: చించిపడేసిన కాజల్ అగర్వాల్.. అరాచకం సృష్టిస్తుంది భయ్యో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “సత్యభామ” . ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఎంత కష్టపడింది అనే విషయం అందరికీ తెలిసిందే . ఈ సత్యభామ థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఫైనల్లీ సత్యభామ అనుకొన్నది సాధించిందా ..? లేదా..? అనే విషయం ఇప్పుడు చదివి తెలుసుకుందాం ..!!

కాజల్ ఢిఫరేంట్ కధలను చూస్ చేసుకుంటుంది అని మొదటి నుంచి తెలిసిందే.. ఇది కూడా అంతే .. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది కాజల్ అగర్వాల్ . కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం కథపై బాగా కాన్సన్ట్రేషన్ చేసింది . మరీ ముఖ్యంగా క్రైమ్ ధ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ గా ఉంది . కథ విషయానికి వస్తే కాజల్ షీ టీం డిపార్ట్మెంట్ ఏసీపీ గా వర్క్ చేస్తూ ఉంటుంది . అమ్మాయిల ఫోటోలను మార్ఫ్ చేసే సోషల్ మీడియాలో పెట్టి ఏడిపించే వాళ్లను అరెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రమాదంలో ఉన్నప్పుడు అమ్మాయిలు షీ టీం కి సంబంధించి యాప్ ను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ ఉంటుంది.

కాగా ఇదే మూమెంట్లో ఒక అమ్మాయి సత్యభామ అదే అండి మన కాజల్ ని కలిసి తన బాధను చెప్తుంది . తన భర్త ఎలా హింసిస్తున్నాడో చెబుతుంది . దీంతో ఆమె కాపాడడానికి సత్యభామ ఏం చేస్తుంది? ఆ తర్వాత కథ ఎలా మరుపు తిరిగింది ..? అసలు మఋదర్ ఎందుకు జరిగింది..? దాని వల్ల కాజల్ ఎలా చిక్కులో పడ్డింది ..? అసలు ఆ హసీనా సత్యభామకు ఏమవుతుంది..? అన్న విషయమే హైలెట్ . కచ్చితంగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా నేటి సమాజంలో అమ్మాయిలు ఎలా చిత్రహింసలకు గురవుతున్నారు..? ఎలా వాటి నుంచి సేఫ్గా బయటపడాలి అనే కోణాల్లో డైరెక్టర్ బాగా తెరకెక్కించారు. అంతేకాదు కాజల్ పెర్ఫార్మెన్స్ కూడా అద్దిరిపోయే రేంజ్ లో ఉంది . ఈ సినిమా అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది . మొత్తానికి కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే మంచి కథను పట్టింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తుంది . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news