సాధారణంగా సాయి పల్లవి అంటే అందరికీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది . వల్గర్ గా ఉన్న పాత్రలను చూస్ చేసుకోదు .. బోల్డ్ కంటెంట్ అసలు టచ్ చేయదు.. అందరికీ ఇదే ఒపీనియన్ .. అఫ్ కోర్స్ సాయి పల్లవి కూడా అలాంటి పాత్రలను చూస్ చేసుకుంటూ వస్తూ ఉంది . అయితే ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లోనే సాయి పల్లవి కనీ విని ఎరుగని సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
సాయి పల్లవి ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిన క్యారెక్టర్ లో నటించబోతుందట. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సాయి పల్లవి ఒక ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయి క్యారెక్టర్ లో కనిపించబోతుందట . మిడిల్ క్లాస్ లో అమ్మాయి.. ఒక అబ్బాయి చేతిలో మోసపోతే ఎలా ఉంటుంది ..? ప్రేమ పేరుతో ఆ అబ్బాయి ఆమెను ఎలా వాడుకొని వదిలేసాడు..? ప్రేమ మోజులో తల్లితండ్రులను పట్టించుకోకుండా ఇంట్లో నుంచి పారిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?
ఆ తర్వాత ఎదుర్కొనే సిచువేషన్ ఎలా ఉంటాయి అన్న రియల్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇందులో సాయి పల్లవి కొన్ని కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా నటించడానికి ఓకే చేసిందట. దానికి కారణం ఈ సినిమా నేటి సమాజంలో ఉన్న యువతీ యువకులకు ఉపయోగపడుతుంది అన్న దాని కోసమే చేస్తుందట. దీంతో సాయి పల్లవి తీసుకుని నిర్ణయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొత్తానికి ఫ్యాన్స్ కోసం తాను పెట్టుకున్న కండీషన్స్ నే బ్రేక్ చేయబోతుంది ఈ హీరోయిన్ సాయి పల్లవి..!