Moviesఏ హీరోయిన్ చేయని పని చేయబోతున్న రష్మిక మందన్నా... నేషనల్ క్రష్...

ఏ హీరోయిన్ చేయని పని చేయబోతున్న రష్మిక మందన్నా… నేషనల్ క్రష్ సెన్సేషనల్ డెసిషన్..!

రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ..కోలీవుడ్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ .. ఎంతలా తన పేరు మారుమ్రోగి పోయేలా చేసుకుంది అంటే ఆమె పేరు కుర్రాళ్ళు పచ్చబొట్టు కూడా పొడిపించేసుకుంటున్నారు. అంతేనా బాయ్స్ హాస్టల్ లో ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా.. ఫోటోలే దర్శనమిస్తున్నాయి. అంతలా హాట్ హాట్ ఫిగర్ తో టెంప్ట్ చేసేస్తూ ఉంటుంది రష్మిక మందన్నా.

కాగా రీసెంట్గా రష్మిక మందన్నా.. తీసుకున్న ఒక నిర్ణయం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. రష్మిక మందన్నా ఇండస్ట్రీకి వచ్చి చాలా తక్కువ టైం అవుతుంది . అయితే ఈ తక్కువ టైంలో బోలెడన్ని హిట్స్ కొట్టేసింది బోలెడంత క్రేజ్ కూడా సంపాదించేసింది. కాగా ఇప్పుడు రష్మిక మందన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. రష్మిక మందన్నాతాజాగా సల్మాన్ ఖాన్ సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే .

మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది రష్మిక . అయితే ఈ సినిమా కోసం తన కెరియర్ లోనే ఎప్పుడు లేని విధంగా హై రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట . ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఏకంగా 15 కోట్లు ఆమె ఈ సినిమా కోసం చార్జ్ చేస్తుందట . దీంతో ఈ విషయం తెలుసుకున్న మిగతా హీరోయిన్ లు షాక్ అయిపోతున్నారు. మేకర్స్ వేరే హీరోయిన్స్ కి రెండు కోట్లు ఇవ్వడానికి నానా తిప్పలు పడుతున్నారు . మరి రష్మిక మందన్నాకు ఏకంగా 15 కోట్లు ఇవ్వడానికి ఎలా ఓకే చేశారు ..? ఈ సినిమాలో అంత బోల్డ్ పాత్రలో కనిపించబోతుందా..? అంటూ మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి రష్మిక ఒకే ఒక్క నిర్ణయం తీసుకొని ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news