Moviesబన్నీకి ఇష్టం లేకుండానే బలవంతంగా పుష్ప2 వాయిదా వేయించారా..? వైరల్ అవుతున్న...

బన్నీకి ఇష్టం లేకుండానే బలవంతంగా పుష్ప2 వాయిదా వేయించారా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!!

ఫైనల్లీ అంతా అనుకున్నదే జరిగింది .. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో బన్నీ నటిస్తున్న పుష్ప2 సినిమా వాయిదా పడిపోతుంది.. పోస్ట్ పోన్ అవ్వబోతుంది.. అంటూ తెగ ప్రచారం జరిగింది .. ఫైనల్లీ దానిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చేసింది చిత్ర బృందం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తాను నటిస్తున్న పుష్ప2 సినిమా వాయిదా పడినట్లు అఫీషియల్ గా ప్రకటించాడు .

సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టారు. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా డిసెంబర్ 6వ తేదీ థియేటర్స్లోకి రాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు . దీంతో ఆగస్టు 15వ తేదీ పుష్ప2 సినిమా థియేటర్స్లోకి రావడం లేదు అంటూ కన్ఫామ్ అయిపోయింది . అయితే ఇదంతా జరగడానికి కారణం మెగా ఫ్యామిలీతో తలెత్తిన వివాదాలు అంటూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై చేస్తున్న ట్రోలింగ్ అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు .

అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలి అని సినిమా మరింత ఆలస్యం కావడానికి అదే కారణం అంటూ ఒక పోస్ట్ చేశారు . కారణాలు ఏవైనా కానీ ఒక బిగ్ బడా పాన్ ఇండియా సినిమా అంతా ఫిక్స్ అయ్యాక కేవలం రెండు నెలల ముందు సినిమాను పోస్ట్ పోన్ చేయడం అనేది చాలా షాకింగ్ గా ఉంది . అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ సినిమా . దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్తో కామెంట్స్ చేస్తున్నారు .అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news