ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఏమైనా చేస్తాడు . ఆ విషయం అందరికీ తెలిసిందే . తారక్ తనదైన స్టైల్ లో నటించి మెప్పిస్తాడు . కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఆఫ్ కోర్స్ ఈ సినిమా ఎప్పుడో కమిట్ అయ్యాడు . కానీ రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చె విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
ప్రశాంత్ నీల్ ఆగస్టులో ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను సెట్స్ పై తీసుకురాపోతున్నట్లు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశాడు . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించబోతున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది . అఫీషియల్ ప్రకటన ఒక్కటే తరువాయి . అయితే ఈ సినిమా కోసం కెరియర్ లో ఎప్పుడు చేయని పని చేయబోతున్నాడట జూనియర్ ఎన్టీఆర్ . ఏకంగా ఈ సినిమా షూటింగ్ 15 దేశాలలో ప్లాన్ చేశారట . ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పాటను తెరకెక్కించే విధంగా షూట్ చేస్తున్నారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ అద్దిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది . నందమూరి అభిమానులు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు .
దీంతో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా షూట్లో ఉన్నాడు తారక్. అదే విధంగా వార్ 2 సినిమాను కూడా సెట్స్ పై కి తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు తారక్. ఈ సినిమా లో కని విని ఎరుగని లుక్స్ లో కనిపించబోతున్నాడట తారక్..!!