ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. కొన్ని కొన్ని సినిమాల విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ప్రభాస్ అదే పని చేస్తున్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు . రెబెల్ స్టార్ గా పాన్ ఇండియా స్టార్ గా తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో .. ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం తన పర్సనల్ లైఫ్ ను వాడుకోవడమే …
మనకు తెలిసిందే.. ప్రభాస్ ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి అస్సలు ఇష్టపడడు . ఫర్ ద ఫస్ట్ టైం నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ హద్దులు మీరిపోయాడు . తన పర్సనల్ లైఫ్ క్రేజ్ ని సినిమా కోసం వాడుకున్నాడు . ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటున్నారు సినీ విశ్లేషకులు . కోట్లు కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్ చేస్తున్న కల్కి సినిమాకి పాజిటివ్ టాక్ అయితే రావడం లేదు ..
అయితే దీని అంతటికి కారణం ప్రభాస్ నా లైఫ్ లోకి స్పెషల్ కోసం రాబోతుంది అంటూ చేసిన పోస్టే అని తెలుస్తుంది . ఈ పోస్ట్ ప్రభాస్ కల్కి సినిమాకు భారీ బొక్క పడేలా చేసింది . త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రభాస్ అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు . ఏమో మరి ప్రభాస్ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాడు చూద్దాం..? ప్రసెంట్ ఈ న్యూస్ పాన్ ఇండియా లెవల్ లో వైరల్ గా మారింది. చూస్తుంటే ప్రభాస్ టైం బ్యాడ్ గా అనిపిస్తుంది..!!