Moviesప్రభాస్ "కల్కి" మూవీ ట్విట్టర్ రివ్యూ: నాగి సరికొత్త ప్రపంచం అదుర్స్..కలలో...

ప్రభాస్ “కల్కి” మూవీ ట్విట్టర్ రివ్యూ: నాగి సరికొత్త ప్రపంచం అదుర్స్..కలలో కూడా ఊహించలేని క్లైమాక్స్..!

ఫైనల్లీ .. కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూసిన కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు . ఇప్పటికే అమెరికాలో షోస్ పడిపోయాయి సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ కూడా బయటకు వచ్చేసింది . సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో కల్కి సినిమాను పొగిడేస్తున్నారు. నాగ్ అశ్వీన్ డైరెక్షన్ వేరే లెవల్ అని .. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసినట్లు మరి ఏ సినిమాలో చూసి ఉండమని ..నిజంగా రెబెల్ అభిమానులకు ఇది ఒక ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు పురాణాలను లింక్ చేసుకొని టెక్నాలజీని ఉపయోగించి నాగ్ అశ్వీన్ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు అని.. థియేటర్స్లోకి వెళ్లి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనం సరికొత్త లోకంలోకి వెళ్ళిపోతామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు పురాణాలను ఆధునిక ప్రపంచాన్ని కంబైండ్ చేసి నాగ్ అశ్వీన్ కథను వలచిన తీరుని ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. సినిమాకి మెయిన్ హైలెట్ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ కచ్చితంగా ప్రతి ఒక్క అభిమానిని అలాగే జనాలని మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించిన విధంగా 100 రెట్ల ట్విస్టులతో భలే మలుపు తిప్పాడు అని.. నాగ్ అశ్విన్ మైండ్ అద్భుతమైన విధంగా వర్క్ చేస్తుంది అని ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ లేరు అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రిలీజ్ అయిన ట్విట్టర్ టాక్ చూస్తుంటే మాత్రం కల్కి సినిమా చరిత్ర సృష్టించబోతుంది అని ఒక్క ముక్కలో చెప్పేసేయొచ్చు. చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news