Moviesప్రభాస్ "కల్కి" సినిమాకి బిగ్ హెడేక్ గా మారిన స్టార్ హీరో.....

ప్రభాస్ “కల్కి” సినిమాకి బిగ్ హెడేక్ గా మారిన స్టార్ హీరో.. ఈ కొత్త తల నొప్పి ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్లోకి రాబోతున్నాడు. కేవలం మూడంటే మూడు రోజులే కరెక్ట్ గా 72 గంటల్లో ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా బాహుబలి కి మించిన రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వబోతుంది అంటూ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు .

కాగా రీసెంట్ గా ఇప్పుడు కల్కి సినిమా కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది . కల్కి సినిమాని ఎలా అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే ఈ క్రమంలోనే కొంతమంది తెలిసి తెలియక గతంలో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు . మనకు తెలిసిందే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన హిట్టు అందుకున్నాడు .

అయితే ఇప్పుడు కల్కి సినిమా టికెట్స్ బుకింగ్ లో బిగ్ కన్ఫ్యూషన్ నెలకొంది . అందరూ ప్రభాస్ కల్కి అనుకొని రాజశేఖర్ నటించిన కల్కి సినిమాకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. కూకట్ పల్లి లో భ్రమరాంబ లాంటి థియేటర్లో ప్రభాస్ కల్కి బదులుగా రాజశేఖర్ కల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు . ఇది మిస్టేక్ వల్లే జరిగింది . అంతేకాదు ఈ కారణంగా దాదాపు రాజశేఖర్ సినిమాకి 6 హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు . బుక్ మై షో ను దారుణంగా తిడుతున్నారు . అయితే బుక్ మై షో వాళ్ళు స్పందించారు. ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే టికెట్లతో ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చని క్లారిటీ ఇచ్చారు .దీనిపై హీరో రాజశేఖర్ కూడా ఫన్నీగా స్పందించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news