Moviesప్రభాస్ పేరు మార్చుకునింది దానికోసమేనా..? బయట పడిన టాప్ సీక్రెట్..!

ప్రభాస్ పేరు మార్చుకునింది దానికోసమేనా..? బయట పడిన టాప్ సీక్రెట్..!

మనకు తెలిసిందే..ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ నటించిన సినిమా కల్కి నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా మొదటి రోజే 180 కోట్లు కలెక్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి మూమెంట్లోనే సినిమాలోని హైలెట్ విషయాలను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు .

కాగా ప్రభాస్ పేరుని ఈ సినిమాలో శ్రీ ప్రభాస్ గా చూపిస్తారు . అయితే ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడు కూడా తన పేరు ముందు శ్రీ అన్న దాన్ని వాడలేదు . ఫర్ ద ఫస్ట్ టైం ఆయన తన పేరును మార్చుకుంటూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు . అయితే ఇది చాలామంది ఏదో సరదాగా పెట్టుకున్న పేరు అంటూ చెప్పుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల నుంచి లీకైన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ పేరు శ్రీ ప్రభాస్ కి మార్చడానికి పెద్ద స్టోరీనే ఉందట .

ప్రభాస్ జాతకంలో ఉన్న దోషాలు కారణంగా ఆయనకు ప్లాప్స్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని.. అదేవిధంగా ఆయనకు పెళ్లి కూడా కాకపోవడానికి కారణం ఇదే అని పండితులు చెప్పడంతో తన పేరులో మార్పులు చేసుకున్నారట. ప్రభాస్ పేరుకు ముందు శ్రీ అనేది వస్తే ఆయనకు చాలా చాలా కలిసి వస్తుందట. చాలామంది కూడా ఇలా పేరు కి ముందు పేరు తర్వాతే శ్రీ ఆడ్ చేసుకుంటూ ఉంటారు ..లక్కు కోసమే ప్రభాస్ ఈ విధంగా తన పేరులో మార్పులు చేసుకున్నారట . అయితే ప్రభాస్కి వీటిపై పెద్దగా నమ్మకం లేకపోయినా తన తల్లి సలహా మేరకే ఇలా చేశాడు అంటున్నారు జనాలు . చూద్దాం మరి ప్రభాస్ లక్ ఏమాత్రం కలిసొస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news