Moviesప్చ్: పుష్ప2కు మరో భారీ బొక్క .. టైం చూసి కొట్టిన...

ప్చ్: పుష్ప2కు మరో భారీ బొక్క .. టైం చూసి కొట్టిన ఫహద్ ఫాసిల్..!!

ఒకదాని తర్వాత ఒకటి పుష్ప2కు భారీ భారీ బొక్క పడుతుంది. అసలకే పుష్ప2పై ఎన్ని కళ్ళు పెట్టుకొని ఉన్నారో ఫాన్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ గ్లోబల్ స్ధాయిలో హిట్ కొడతాడా..? అంటూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఉన్నారు . పాపం దిష్టి తగిలిందో ..? లేకపోతే ఆయన టైం బాగోలేదో.. తెలియడం లేదు కానీ పుష్ప2కి ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పడుతున్నాయి .

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా ఆగస్టులో రిలీజ్ అవ్వదు అంటూ బాగా వైరల్ గా మారింది. కొన్ని కారణాల చేత పుష్ప2ను వాయిదా వేయబోతున్నాడట సుకుమార్ . అయితే ఈ న్యూస్ తోనే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంటే.. మరొక న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఫహద్ ఫసిల్.. లాస్ట్ మినిట్లో బన్నీకి అదే విధంగా సుకుమార్ కి హ్యాండ్ ఇచ్చారట .

జనరల్ గా ఒక రోజు కింద కాల్ షీట్స్ రెమ్యూనరేషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఈ హీరో . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పుష్ప సినిమా షూటింగ్ కోసం కేరళ నుంచి హైదరాబాద్కు రావాలి. ఏ రోజు షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఫ్లైట్లో వచ్చేస్తాడు . అయితే ఈ మధ్యకాలంలో పుష్ప2 షెడ్యూల్ ఉన్నఫలంగా క్యాన్సిల్ అయిపోతుంది . పాపం వేరే సినిమాకు కమిట్ అయిన కాల్ షీట్స్ పుష్ప2కి ఇచ్చి భారీ స్థాయిలో నష్టపోతున్నాడట ఈ నటుడు.

ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారట . ఇకపై షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆ కాల్ షీట్ రేట్ .. డబుల్ చార్జ్ చేసి ఫైన్ చేస్తాడట .. 15 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునే కాల్ షీట్ కాస్త 30 లక్షలు చెల్లించాల్సి వస్తుందట . అంతేకాకుండా ఫ్లైట్ ఖర్చులు అదనపు ఖర్చులు మొత్తం కూడా నిర్మాతలే భరించాలట . ఇలాంటి ఒక రూల్ పెట్టాడట ఫహద్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news