Moviesమినిస్టర్ అయ్యాక ఆ విషయాన్ని మర్చిపోయిన పవన్ కళ్యాణ్.. మీరు గమనించారా..!

మినిస్టర్ అయ్యాక ఆ విషయాన్ని మర్చిపోయిన పవన్ కళ్యాణ్.. మీరు గమనించారా..!

పవన్ కళ్యాణ్ అన్న పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది మాటలు.. ఆయన బిహేవియర్.. ఆయన మంచితనం.. ఆయనలోని కోపం.. పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తో.. అంతే మొండివాడు కూడా .. ఈ విషయం చాలామందికి తెలుసు. జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎన్నోసార్లు టంగ్ స్లిప్ అయ్యాడు . పవన్ కళ్యాణ్ సొంత ఫాన్స్ ని కూడా అరిచిన సందర్భాలు ఉన్నాయి . అదంతా ఏదో పగతోనో ప్రతి కారంతోనో కాదు.. ఒక ఎమోషన్ అంతే . మనం ఇంట్లో మన పిల్లలపై ఎలా అరుస్తామో ..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యాన్స్ ను అదేవిధంగా భావించి కొన్ని కొన్ని సార్లు అరిచిన సందర్భాల్లో ఉన్నాయి .

అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్గా పిఠాపురం ఎమ్మెల్యేగా మారిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిపోయారు . దీంతో పవన్ ఫ్యాన్స్ హ్యాపీనే.. కానీ సినిమాల పరంగా దూరం కాబోతున్నాడు అన్న బాధ కూడా ఉంది . రీసెంట్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఓట్ల మెజారిటీతో గెలిచాడు పవన్ కళ్యాణ్ అని తెలిసిందో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ని మనం గమనిస్తే చాలా సౌమ్యుడుగా మారిపోయాడు.

నెమ్మదిగా మాట్లాడుతున్నాడు.. ఎక్కడ అగ్రిసివ్ స్పీచ్ ఇవ్వడం లేదు.. తనను ముప్పు తిప్పలు పెట్టిన వైసీపీ పార్టీని సైతం ఆయన చాలా కూల్ గా డీల్ చేస్తున్నారు. పగలు ప్రతికారాలు తీర్చుకునే టైపు మేము కాదు అంటూ స్మూత్ గా కొట్టి పడేశారు. పవన్ కళ్యాణ్ లో అగ్రిసివ్ నెస్ తగ్గింది . దానికి కారణం ఆయన ఎమ్మెల్యేగా మారడమేనా..? లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా..? అన్న కోణంలో చర్చించుకుంటున్నారు జనాలు . ఏమో పవన్ కళ్యాణ్ ఇంత సైలెంట్ గా ఉంటే అస్సలు బాగోలేదు.. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మొత్తం ఆ ఊపుడు కారణంగానే వచ్చింది. మరి అలాంటి ఊపుడు అదృష్టం వదిలేసుకుంటున్నాడు పవన్.. అది కరెక్టేనా అన్న కోణంలో ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news