Movies"పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్లు పట్టుకోవడం ఏంటి..?".. పరుచూరి గోపాలకృష్ణ సెన్సేషనల్...

“పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్లు పట్టుకోవడం ఏంటి..?”.. పరుచూరి గోపాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..!

పరుచూరి గోపాలకృష్ణ ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలో ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ నెట్టింత బాగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజీ గుర్తింపు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలోని ప్లస్ లను.. మైనస్లను ..ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది..? ఏం చేసి ఉంటే హిట్ అయి ఉండేది ..?అనే విషయాలను బాగా క్షుణ్ణంగా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్లు పట్టుకోవడంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .

పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో వెల్కమ్ చెప్పాడు అన్న మెగాస్టార్ చిరంజీవి ..మెగా వెల్కమ్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది ..ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . కాగా పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంతో అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కరించారు . దానికి సంబంధించి చాలా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అయితే పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా దాని గురించి పాజిటివ్గా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ..” చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నేను వర్క్ చేశాను ..ఆయన నిజాయితీగల మనిషి .. ఆయన అరెస్టు చేసినప్పుడు చాలా బాధేసింది.. పట్టుదలతో కృషితో ఇంతవరకు వచ్చారు. ఆయన గెలుస్తాడు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు.. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నప్పుడు కళ్ళల్లో నాకు ఆయన కసి బాగా కనిపించింది.. నేను గెలవబోతున్నాను అన్న ధీమా కూడా కనిపించింది ..బాలకృష్ణ గెలుస్తాడు అని నాకు ముందే తెలుసు .. నా చెల్లెలు లాంటి పురందేశ్వరి గెలవాలి అని నేను బాగా కోరుకున్నాను ..ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు” అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ . ప్రజెంట్ ఆయన కామెంట్స్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news