Moviesపాన్ ఇండియా స్టార్ అయిన ..ఆ మూడు విషయలల్లో మన డార్లింగ్...

పాన్ ఇండియా స్టార్ అయిన ..ఆ మూడు విషయలల్లో మన డార్లింగ్ ప్రభాస్ ఢమ్మీనే..!!

ప్రభాస్ ..ప్రజెంట్ ఈ పేరు ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కష్టపడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది . ఇలాంటి మూమెంట్లోనే ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి . ప్రభాస్ తనలోని మూడు విక్ నెస్ పాయింట్లను బయటపెట్టేసాడు . సాధారణంగా ఎవ్వరూ కూడా తమలోని వీక్నెస్ పాయింట్లను బయట పెట్టరు .

కానీ ప్రభాస్ మాత్రం ఓపెన్ గానే తనలో ఉన్న మైనస్ ఇవే అంటూ చెప్పేశారు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ లో ఉన్న మూడు వీక్నెస్ పాయింట్లు ఇవే . ప్రభాస్ అందరితో మింగిల్ అవ్వలేడు.. మొదటి నుంచి ఎందుకో ఆయనకు అది అలవాటు లేదట. మిగిలిన పర్సన్స్ తో మాత్రం బాగా బాగా క్లోజ్ గా ఉంటారట. అంతేకాదు మైక్ పట్టుకొని మాట్లాడలేడు. ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ స్టేజ్ ఫియర్ …

కెమెరా ముందు ఎలాంటి సీన్స్ లోనైనా సరే నటించేస్తాడు ..కానీ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలి అంటే మాత్రం ప్రభాస్ కి వణుకు వచ్చేస్తుందట . దానికి రీజన్ ఏంటో కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సిగ్గు – మొహమాటం నలుగురు జనాలు ఒక దగ్గర ఉంటే కచ్చితంగా ఆయన అక్కడ ఉండలేదట . చేతులు కాళ్లు వణుకు వచ్చేస్తాయట . షివరింగ్ తో పక్కకు వెళ్లిపోతాడట. ఈ విషయాన్ని స్వయాన ప్రభాస్ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. ఇది తెలుసుకున్న జనాలు బహుశా అందువల్లే ఆయనకు పెళ్లి కావడం లేదేమో ..ఇంత సిగ్గా ప్రభాస్ అంటూ మాట్లాడుకుంటున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news