Moviesఓరి మీ దుంపల్ తెగ.. ఇంత ఎమోషనల్ జర్నీలోనూ ..ఆ తప్పును...

ఓరి మీ దుంపల్ తెగ.. ఇంత ఎమోషనల్ జర్నీలోనూ ..ఆ తప్పును ఎలా కనిపెట్టారా సామీ(వీడియో)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ..ట్రోలింగ్ నెగిటివిటీ అనేది మాత్రం చాలా చాలా పెరిగిపోయింది . ఎలా అంటే ఒక తల్లి పిల్లాడికి పాలి ఇస్స్తున్న సరే దానిని వక్ర బుద్ధితో ట్రోలింగ్ చేసే జనాలు సొసైటీలో ఉన్నారు. కాగా రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గ నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గెలిచిన విషయం తెలిసిందే . అందరు పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పవన్ కళ్యాణ్ ను పిలవడం మొదలుపెట్టారు . కాగా ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు తన ఇంట్లో ఘన స్వాగతం పలికారు.

ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెడుతున్న పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో వెల్కం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు . మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గెలవడం పట్ల సంబరాలు చేసుకోవడం ..ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం ..మనం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన భార్య కొడుకు అకీరాతో మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి సందడి చేశారు. ఇదే క్రమంలో తన తల్లి తన అన్న తన వదిన ఆశీర్వాదాలను తీసుకున్నారు .

కాళ్లపై పడి దండం పెట్టి ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ బాండింగ్ గురించి అర్థం చేసుకుంటున్నారు . కానీ కొంతమంది ఆకుతాయలు మాత్రం ఎందుకు చిరంజీవి సురేఖ కాళ్ళకు మాత్రమే దండం పెట్టారు..? నాగబాబు పద్మజాకాళ్లకు దండం పెట్టలేదు ..? అనే విధంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . అంతేకాదు నాగబాబుని లైట్గా తీసుకున్నాడా..? అంటూ వెటకారంగా కౌంటర్స్ చేయడం ప్రారంభించారు. దీంతో మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. ఓరి మీ దుంపల్ తెగా ఇంత మంచి ఎమోషనల్ జర్నీలో కూడా మీరు ఈ తప్పును ఎలా కనిపెట్టారు ..? అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ చూసి మాకు ఇలాంటి అన్న ఉంటే బాగుండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news