Moviesఓరి దుర్మార్గుడా.. పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ఈ నిర్మాత అలా కూడా...

ఓరి దుర్మార్గుడా.. పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ఈ నిర్మాత అలా కూడా చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కాదు కాదు కాదు ఇప్పుడు మనందరం పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పిలవాలి. సరదాగా అన్నా సీరియస్ గా అన్నా.. అది నిజమే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆయనని పవర్ స్టార్ అని పిలవడం కన్నా పవన్ కళ్యాణ్ అని పిలవడం కన్నా.. పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పిలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. పలువురు స్టార్స్ కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ కి విష్ చేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ .. పవన్ కళ్యాణ్ ని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అంటూ బాగా ఫన్నీగా జోబియల్ గా ట్విట్ చేయడం అందరికీ ఆకర్షణీయంగా ఆసక్తికరంగా అనిపించింది .

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే . ఆ విన్నింగ్ వైబ్స్ ను ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . త్వరలోనే మినిస్టర్గా ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ కొనిదెలా అను నేను అనే మాట పవన్ కళ్యాణ్ నోటి నుండి వస్తుందంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మరొక వార్త ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గెలవడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతమంది స్టార్స్ సపోర్ట్ చేశారు అన్న విషయం మనకు తెలిసిందే.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని ఓ నిర్మాత కోట్లలో బెట్టింగ్ వేసాడట . గత తాలూకా ఎన్నికల రిజల్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవడు అని ఆయన ఏకంగా కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టాడట .. ఆయన దురదృష్టం ఆయనను వెంటాడింది .. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచాడు.. వైసిపి గెలుస్తుందని బెట్టింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని పెట్టి మొత్తంగా 10 కోట్లు నష్టపోయాడట . ఎవరు ఊహించిన విధంగా వైసిపి దారుణంగా ఓడిపోయింది.. పవన్ కళ్యాణ్ మాత్రం గెలుస్తాడు అంటూ ముందు నుంచే పలు సర్వేలు చెప్పాయి ..అన్న విధంగానే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు ..పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి అని కోరుకున్న ఆ నిర్మాత బెట్టింగ్లో ఓడిపోయాడు 10 కోట్లకు పైగానే నష్టం వచ్చిందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news