Moviesఓరి దేవుడోయ్.. బన్నీతో సినిమా ఓకే చేసిన ఏ డైరెక్టర్ కి...

ఓరి దేవుడోయ్.. బన్నీతో సినిమా ఓకే చేసిన ఏ డైరెక్టర్ కి మెగా హీరో ఛాన్స్ ఇవ్వకూడదా..? ఇదెక్కడి కొత్త రూల్..!

ఇది మరీ టూమచ్ గా ఉంది.. బన్నీతో ఏ డైరెక్టర్ సినిమాకి కమిట్ అయిన ఆ డైరెక్టర్ తో మెగా హీరో సినిమాలు చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. రీజన్ ఏంటో తెలియటం లేదు కానీ ఈ వార్త మాత్రం జెట్ స్పీడ్ లో వైరల్గా మారిపోయింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ అలాగే మెగా ఫాన్స్ మధ్య వార్ ఏ రేంజ్ లో ముందుకెళ్తుందో చూస్తున్నాం .

దానంతటికీ కారణం కూడా మనకు తెలిసిందే. పొలిటికల్ ఇష్యూస్ ను ఇంటి వరకు తీసుకొచ్చుకున్నారు ఈ హీరోలు. గోరితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్లకు సంబంధించిన మరొక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు స్టేటస్ క్రియేట్ చేసుకున్నాడు .

పుష్ప 2 సినిమాతో అది గ్లోబల్ స్థాయికి వెళ్లిపోబోతుంది. అయితే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవలు కారణంగా మెగా హీరోలు సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఎవరైతే బన్నీతో సినిమాను డైరెక్టర్ చేస్తున్నారో అటువంటి డైరెక్టర్స్ కు మెగా హీరోస్ ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ ఫిక్స్ అయ్యారట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . ఫ్యాన్స్ కూడా ఈ వార్త కి అలాగే రియాక్ట్ అవుతున్నారు . అయితే ఈ వార్త నిజమా..? అబద్దమా..? లేక రుమరా..? తెలియాలి అంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ స్పందించాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news