Moviesఓరి దేవుడోయ్ .. రాజమౌళి సైలెంట్ గా ఆ పని చేస్తున్నాడా..?...

ఓరి దేవుడోయ్ .. రాజమౌళి సైలెంట్ గా ఆ పని చేస్తున్నాడా..? హౌ లక్కీ ఈ హీరోయిన్..!

రాజమౌళి .. సైలెంట్ గా ఏ పనైనా చేసేస్తాడు .. చేసిన పని అభిమానులకి నచ్చే విధంగా మలుచుకుంటాడు . ఒక సినిమా కోసం రాజమౌళి ఎంత కష్టపడతాడో.. ఎదుటివారిని ఎంత కష్టపెడతాడో.. ఆయన డైరెక్షన్లో నటించిన హీరోలను అడిగితే ఆ విషయం ఈజీగా చెప్పేస్తారు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఎన్టీఆర్లు ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కూడా అందరికీ తెలిసిందే.

కాగా.. ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి . ఈ సినిమా కోసం చాలా చాలా టైం తీసుకుంటున్నారు . నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ మహేష్ లుక్స్ విషయంలో సాటిస్ఫై అవ్వని రాజమౌళి చాలా చాలా టైం టేకింగ్ తీసుకుంటున్నారు.. ఇంకొక ఆరు నెలలు తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందట . అయితే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ను చాలా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫైనలైజ్ చేస్తున్నాడట రాజమౌళి.

ఇప్పుడు సైలెంట్ గా తన ఫేవరెట్ హీరోయిన్ మమిత బైజును ఈ సినిమాలో భాగం చేసే ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి . ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం మమిత బైజు ని చూస్ చేసుకున్నాడట.. రాజమౌళి . అయితే ఈ పాత్ర హీరోయిన్ కి సంబంధించింది కాదు కానీ మమిత బైజు ఈ పాత్రని ఒప్పుకుంటుంది అన్న ధీమాతోనే ఆయన ఈ క్యారెక్టర్ ను ఆమెకు ఫిక్స్ చేసి పెట్టారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు .నిజంగా మమిత బైజు సో లక్కీ హీరోయిన్ అంటున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news