Moviesఓరి దేవుడోయ్.. సుకుమార్ ఆ హీరో కి కాల్ చేసి అంత...

ఓరి దేవుడోయ్.. సుకుమార్ ఆ హీరో కి కాల్ చేసి అంత మాట అన్నాడా..? అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చిందా..?

పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ పేరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా మారు మ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. సాధారణంగా సుకుమార్ అంటే అందరికీ ఒక బిలీవ్ ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళడు.. తన పని తాను చేసుకుంటాడు ..తన సినిమా షూట్ తను కంప్లీట్ చేసుకొని మిగతా హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతూ ఉంటాడు ..అందరికీ ఇంతవరకే తెలుసు . కానీ సుకుమార్ సో టాలెంటెడ్ ..ఎలా అంటే బడాబడా హీరోలతో ఎలా సినిమాకి కామెంట్ చేయించాలో బాగా తెలిసిన వ్యక్తి .

రీసెంట్ గానే సుకుమార్ చేసిన ఒక పని ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది. సుకుమార్ లో ఈ టాలెంట్ కూడా ఉందా రా బాబు అని అనిపించేలా చేసింది . ప్రభాస్ నటించిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరు ప్రభాస్ ని నాగ్ అశ్వీన్ ని పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ డైరెక్ట్ గా ప్రభాస్ కి కాల్ చేసి మరి విష్ చేశాడట . అంతేనా మాటల సందర్భంలోనే ప్రభాస్ ని మాయ చేసి ఆయన కాల్ షీట్స్ తీసుకొని ఒక క్రేజీ ప్రాజెక్టు కి కమిట్ అయ్యాడట .

విష్ చేయడానికి కాల్ చేసి కాల్ షీట్స్ తీసుకున్నాడు అంటే సుకుమార్ ఎంత టాలెంటెడ్ ఫెలోనో అర్థం చేసుకోవచ్చు .. ఆల్రెడీ పుష్ప2తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు . అదేవిధంగా రామ్ చరణ్ తోను ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఇప్పుడు ప్రభాస్తోను ఒక క్రేజీ ప్రాజెక్టు ని తెరకెక్కించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హీరోలతో సినిమా అంటే సుకుమార్ పేరు ఇక రేంజ్ లో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుందో అర్థం చేసుకోవచ్చు . అందుకే సుకుమార్ ని టాలెంటెడ్ అంటూ ఉంటారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news