Moviesఓరి దేవుడోయ్..బాలయ్య అంటే అంత పిచ్చా..పుట్టినరోజు నాడు అభిమానులు ఏం...

ఓరి దేవుడోయ్..బాలయ్య అంటే అంత పిచ్చా..పుట్టినరోజు నాడు అభిమానులు ఏం చేశారో చూడండి..!

సాధారణంగా ఏ అభిమాని అయిన సరే తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజు నాడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు కానీ ఎక్కువ హంగామా చేస్తూ ఉంటారు. భారీ భారీ కటౌట్లను రెడీ చేయడం ..ఫ్లెక్సీలతో హంగామా చేయడం పూలమాలలు వేయడం పాలాభిషేకాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు . కొంతమంది తమకు తోచిన విధంగా అన్నదానం చేస్తూ ఉంటారు.. కేక్ కటింగ్ లతో రచ్చ రంబోలా చేస్తూ ఉంటారు . అయితే అందరిలోకి చాలా చాలా స్పెషల్ నందమూరి ఫ్యాన్స్ .

నిన్న బాలయ్య తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య పుట్టినరోజును ఆయనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే నందమూరి అభిమానులు సైతం ఘనంగా చేసుకున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హైలైట్ గా మారింది . బాలయ్య అభిమానులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా రకరకాల మంచి పనులు చేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఎప్పుడు చల్లగా ఉండాలి అని కోరుకున్నారు .

ఇదే క్రమంలో బాలయ్య వీరాభిమాని ఒకరు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టి బాలయ్య పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఎన్టీఆర్ అంటే వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజు గారి కొడుకు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బాలకృష్ణకు వీరాభిమాని ..శ్రీధర్ వర్మ తిరుమలలో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖిలాండం వద్ద ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టి ఐదు కిలోల కర్పూరం వెలిగించి బాలయ్య పేరిట పూజలు నిర్వహించారు . బాలకృష్ణ 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news