కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు భలే భలే విచిత్రంగా ఉంటాయి. ఫ్యాన్స్ కి కూడా అర్థం కాదు . కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . అసలు ఏ హీరోయిన్ తో కూడా మాట్లాడడు .. తన పని తాను చూసుకొని పోతూ ఉంటాడు . మరికొన్నిసార్లు మాత్రం చాలా చాలా నాటి ఫెలో గా మారిపోతూ ఉంటాడు . ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం బాగా వైరల్ గా మారింది .
జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ ప్రెసెంట్ థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో జాన్వి కపూర్ ఎన్టీఆర్ ల చేత రొమాంటిక్ సాంగ్ కి స్టెప్స్ వేయించబోతున్నారు కొరటాల శివ. నిజానికి థాయిలాండ్ కి తారక్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు . తారక్ లక్ష్మీ ప్రణతి తన పిల్లలు అంతా కూడా థాయిలాండ్ కి కలిసి వెళ్లారు .
అయితే ఈ సినిమా షూట్ లో లక్ష్మీ ప్రణతి కూడా పాల్గొంటుందట . ఇప్పుడు జాన్వి తో రొమాన్స్ చేసే సాంగ్లోను కొన్ని షాట్స్ లో లక్ష్మీ ప్రణతి అక్కడ ఉండబోతుందట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోతున్నారు. భార్య ముందే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తావా..? ఊర మాస్ తారక్ అంటూ పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో తారక్ పేరు ఇప్పుడు మారు మ్రోగిపోతుంది..!!