Movies"ఎవ్వరు ఏమనుకున్న నో ప్రాబ్లం..ఆ విషయంలో ఆ హీరోయిన్ ని ఢీ...

“ఎవ్వరు ఏమనుకున్న నో ప్రాబ్లం..ఆ విషయంలో ఆ హీరోయిన్ ని ఢీ కొట్టే ఆడదే లేదు”..బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!

నందమూరి బాలయ్య.. ఎప్పుడు కూడా ఎనర్జిటిక్ గా ఉంటాడు.. సినిమాలలో ఎంత హైపర్ఫామెన్స్ ఇస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా 100 క్లబ్ లోకి చేరుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు సంబంధించిన పాత వీడియోలను కూడా ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు .

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ హీరోయిన్ సిల్క్ స్మిత గురించి మాట్లాడిన మాటలు మరొక్కసారి నెట్టింట వైరల్ గా మారాయి. బాలయ్య తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . కానీ అందరిలోకి చాలా చాలా డిఫరెంట్ సిల్క్ స్మిత అని పొగిడేశారు బాలయ్య. కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా ఆదిత్య 369 . సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు . అందులో ఒక పాత్ర శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు . సిల్క్ స్మిత కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించి మెప్పించింది .

ఆమె పర్ఫామెన్స్ ఎప్పటికీ మర్చిపోలేము . ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాలయ్య మేకప్ విషయంలో కాస్ట్యూమ్ విషయంలో సిల్క్ స్మితాను కొట్టే ఆడదే లేనేలేదు అంటూ చాలా చాలా బోల్డ్ గా స్పందించారు . ఆడది అని ఎందుకు అంటున్నాను అంటే కూడా క్లారిటీ ఇచ్చారు . అప్పటి టాప్ హీరోయిన్స్ వారందరూ కూడా మేకప్ విషయంలో సిల్క్ స్మిత అనే ఫాలో అయ్యేవారట . సిల్క్ స్మిత ఎలా మేకప్ వేసుకుంటుంది ..?ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటుంది ..?ఎలాంటి కేర్ తీసుకుంటుంది..? హాట్ గా ఉండడానికి కారణం ఏంటి ..? అనేది అన్ని వాళ్ళు ఆమెను అడిగి మరీ తెలుసుకునే వారట . అందులో సిల్క్ స్మిత టూ ఎక్స్పర్ట్ అని ఆమెను ఢీకొట్టే ఆడదే లేదు అని బాలయ్య చెప్పుకు రావడం అప్పట్లో సెన్సేషనల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news