Moviesఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ 'జబర్దస్త్" కమెడియన్ ఇక లేరు..!

ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ ‘జబర్దస్త్” కమెడియన్ ఇక లేరు..!

మరణం ..ఎప్పుడు ..? ఎవరిని..? ఎలా వెంటాడుతుందో ఎవ్వరం చెప్పలేము. దానికి మరో ఎగ్జాంపుల్ ఇది . అప్పటివరకు చాలా హెల్తీగా చాలా చక్కగా చాలా ఆనందంగా ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మరణం చిందరవందర చేసేసింది . ఒకే ఒక్క తొందరపాటు నిర్ణయంతో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు జబర్దస్త్ ఆర్టిస్ట్ మహ్మద్దీన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన జబర్దస్త్ ఆర్టిస్ట్ మహమ్మదీన్… కాలు స్లిప్ అయ్యి ట్రైన్ పట్టాల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు . ఈ విషయం ఇప్పుడు అభిమానులకి జీర్ణించుకోలేని పరిస్థితి క్రియేట్ చేసింది .

చెంచుపల్లి మండలం నందా తండాలో మేధర్ మహమ్మదీన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు . కాగా శుక్రవారం భద్రాచలం రైల్వే స్టేషన్ కు మార్నింగ్ వచ్చారు. స్టేషన్ లో కాకతీయ ఎక్స్ప్రెస్ ముందుకు కదులుతూ వచ్చింది ఆ సమయంలోనే రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు మహమ్మదీన్. అయితే పొరపాటున కాలు కిందకి జారిపోయింది. ట్రైన్ ప్లాట్ఫారం మధ్య ఇరుక్కుపోయాడు . వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు గమనించి చైన్ లాగినా సరే ప్రయోజనం లేకుండా పోయింది .

ట్రైన్ పట్టాలు ట్రైన్ మధ్య ఇరుక్కుపోయాడు . అతి కష్టం మీద ఆయనను బయటకు తీసి ఆంబులెన్స్ లో కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తరలించారు . టెస్ట్ చేసిన డాక్టర్ లు.. మహమ్మదీన్ నడుము పక్కనే ఒక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు . మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించారు . అయితే ఈలోపే మహమ్మద్దీన్ తుది శ్వాస విడిచారు . డెడ్ బాడీని సర్వజన ఆస్పత్రికి తరలించారు. మహమ్మదీన్ టీవీ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు . ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్నాడు. దీంతో ఫాన్స్ శోకసంద్రంలో నిండిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news