Moviesచరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన నాగబాబు..పవన్ కళ్యాణ్ అండతోనే అంత...

చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన నాగబాబు..పవన్ కళ్యాణ్ అండతోనే అంత మాట అన్నాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీలో ఇదివరకు ఏం జరిగింది..? అనే విషయాలను కూడా మరొకసారి రి కాల్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు జనాలు . ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కీలక కారణమైన నాగబాబు లైఫ్ కి సంబంధించిన విషయాలు మరొకసారి ట్రెండ్ అవుతున్నాయి. కాగా మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ చిరంజీవి అంత హై స్థానంకి ఎదగలేకపోయాడు నాగబాబు .

రీజన్ ఏంటో తెలియదు కానీ మెగాస్టార్గా చిరంజీవి .. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ఎదిగిన విధంగా నాగబాబు ఇండస్ట్రీలో స్థానం దక్కించుకోలేకపోయాడు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు కానీ పెద్ద స్థాయి మాత్రం అందుకోలేకపోయాడు . కాగా నాగబాబు పలు సినిమాలను కూడా నిర్మించారు.. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ అన్ని సినిమాలలోకి ఆయనకు భారీగా దెబ్బేసిన సినిమా మాత్రం రామ్ చరణ్ నటించిన ఆరంజ్ మూవీ అనే చెప్పాలి .

ఈ సినిమా టైంలో ఆయన గుడ్డిగా అందరిని నమ్మేయడం వాళ్ళు ఆయనను చీట్ చేయడం పని సరిగ్గా చేయకుండా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేయడం .. నాగబాబుకు భారీ లాస్ వచ్చేలా చేసింది . సినిమా కూడా డిజాస్టర్ టాక్ అందుకుంది . అయితే ఆ టైంలో నాగబాబు మొత్తం ఆస్తి అమ్మినా కూడా ఆరెంజ్ సినిమా అప్పులు 10% కూడా పూర్తయ్యేటివి కావట . ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకోవాలనుకున్నారట . ఆ టైంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ బాగా హెల్ప్ చేశారట . మొత్తం అప్పులు తీర్చేసి రిలాక్స్ గా ఉండు అంటూ భరోసా ఇచ్చారట .

అప్పులు తీరిపోయాయి కానీ బ్రతకడానికి డబ్బులు కావాలిగా అంటూ ఎదురు చూస్తున్నా మూమెంట్లో బుల్లితెర ఆయనను ఆదుకుందట . పలు సీరియల్స్ లో నటించి బాగానే డబ్బులు సంపాదించుకున్నారట. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా కూడా కొంచెం డబ్బులు సంపాదించుకొని సెటిల్ అయ్యాడు నాగబాబు. అయితే ఆరెంజ్ సినిమా విషయంలో రామ్ చరణ్ కి 50 పర్సెంట్ రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చారట . ఇప్పటికీ 50% బాకీ ఉన్నాడట . ఏదో ఒక రోజు కచ్చితంగా తీర్చేస్తాను అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు . దీంతో నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . కొంతమంది ఈ కామెంట్స్ ని కూడా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు. నీకేం పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా తీర్చేస్తావులే అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news