Moviesజాక్ పాట్ ఛాన్స్ కొటేసిన మృణాల్ ఠాకూర్.. ఫైనల్లీ తన కోరిక...

జాక్ పాట్ ఛాన్స్ కొటేసిన మృణాల్ ఠాకూర్.. ఫైనల్లీ తన కోరిక తీర్చుకోబోతుందిగా..!

ఇండస్ట్రీ లోకి వచ్చాక హీరోయిన్స్ తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ..? ఎవ్వరు చెప్పలేం. అది ఎందుకో అర్థం కాని పరిస్థితి ఉంటుంది . అయితే రీసెంట్ గా ఇక్కడ మృణాల్ ఠాకూర్ అదృష్టం మొత్తం మారిపోయింది. సీతారామం మూవీ తర్వాత తలరాత-అదృష్టం రెండూ ఒకేసారి మారిపోయినట్లు తెలుస్తుంది. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎలా తన ఫేట్ మార్చేసుకుందో మనం చూసాం .

బడా బడా స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆమె నటించిన హాయ్ నాన్న సినిమా హిట్ అయిన ఆ తర్వాత నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా బోల్తా కొట్టింది. దీంతో మృణాల్ ఠాకూర్ చాప్టర్ క్లోజ్ అంటూ అనుకున్నారు జనాలు . సీన్ కట్ చేస్తే మృణాల్ ఠాకూర్ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది . ప్రతి ఇంటర్వ్యూలోను రాంచరణ్ తో నటించాలి అని ఉంది అని .. రాంచరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఉంది అని..

పదే పదే డప్పు కొట్టి కొట్టి ఫైనల్లీ రాంచరణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మొదటగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత సమంత సినిమా రిజెక్ట్ చేసింది . ఆ రోల్ ల్లోకి ఇప్పుడు మృణాల్ ఠాకూర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఏం ప్రతి ఇంటర్వ్యూలోను తనకు తానే డప్పు కొట్టుకొని మరి ఈ బ్యూటీ బాగానే ఆఫర్ పట్టేసింది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news