Moviesపవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలియగానే తల్లి అంజనమ్మ ఏం చేసిందో...

పవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలియగానే తల్లి అంజనమ్మ ఏం చేసిందో తెలుసా..అమ్మ ప్రేమ అంటే ఇదేగా..!!

ఫైనల్లీ.. కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేసిన విన్నింగ్ మూమెంట్ వచ్చేసింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు . నిన్న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల కౌంటింగ్ ముగిసింది . ఒకటి కాదు రెండు కాదు ఎవ్వరూ ఊహించని భారీ స్థాయిలో ఏపీలో కూటమికి అధికారం కట్టబెట్టారు జనాలు . గవర్నమెంట్ ఫామ్ చేయడమే కాదు కొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది .

అసలు వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసింది . కేవలం 10 సీట్లతోనే సరిపెట్టుకునేలా భారీ దెబ్బ కొట్టింది ఏపీ కూటమి వైసిపిని.. కాగా పవన్ కళ్యాణ్ గెలవడం సినిమా ఇండస్ట్రీలోని జనాలకు ఆయన కుటుంబ సభ్యులకు బాగా ఆనందాన్ని తెచ్చిపెట్టింది . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు . “నా కొడుకు గెలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.. ఇకనుంచి నేను గాజు గ్లాసులోనే టీ తాగుతాను అంటూ ఆస్వాదిస్తూ ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేసింది”.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఒక కొడుకు గర్వంగా తలెత్తుకునేలా చేస్తే ఏ తల్లి ఆనందపడదు.. పవన్ కళ్యాణ్ గెలవడం మీకే కాదమ్మా.. ఎంతోమంది తల్లులకు ఆనందాన్నిస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు . కొడుకు గెలిచాడు అని తెలిసి అంజనమ్మ ఆనందపడడం చూసిన మెగా కుటుంబ సభ్యులు షాక్ అయిపోతున్నారు. ఇదివరకు ఎప్పుడూ కూడా అంజనమ్మని ఇలా చూడలేదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news