Moviesఇండియన్ సినిమా చరిత్రలోనే ..అలాంటి ఊర మాస్ రికార్డ్ సాధించిన ఏకైక...

ఇండియన్ సినిమా చరిత్రలోనే ..అలాంటి ఊర మాస్ రికార్డ్ సాధించిన ఏకైక హీరో మన ప్రభాస్..!

నిజంగానే ఇది రెబల్ అభిమానులకు సూపర్ సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో హీరోలు సినిమాలో నటించడం కామన్ ..కానీ క్రేజీ క్రేజీ రికార్డ్స్ నెలకొల్పడంలో మాత్రం ప్రభాస్ తర్వాతే మిగతా ఎవరైనా అని చెప్పాలి . రీసెంట్గా ప్రభాస్ కల్కి సినిమాలో నటించిన విషయం తెలిసిందే . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే ఒకటి 191.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ కెరియర్ లోనే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది .

ఈ క్రేజీ రికార్డ్ తో ప్రభాస్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సెన్సేషనల్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలో 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఐదు సార్లు రాబట్టిన ఒకే ఒక్క హీరో మన డార్లింగ్ ప్రభాస్ . ఆయన నటించిన వరుసగా ఐదు సినిమాలు డే వన్ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి . ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన హీరో లేకపోవడం గమనార్హం.

దీంతో భారతీయ సినీ చరిత్రలోనే ప్రభాస్ క్రేజీ రికార్డ్ నెలకొల్పాడు. అంతేకాదు ప్రభాస్ హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశారు . నాలుగో సారి 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూలు రాబట్టిన ఏకైక హీరోగా కల్కి సినిమాతో చరిత్ర సృష్టించాడు ప్రభాస్ . దీంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అంతేకాదు ఇలాంటి క్రేజీ రికార్డ్ నెలకొల్పాలి అంటే చాలా చాలా కష్టం .. ఈ క్రేజీ రికార్డ్ ని ఎవరు బద్దలు కొడతారో చూద్దాం..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news