Moviesనాన్న సినిమా చూస్తూ అకిరా ఏం చేశాడో చూడండి.. దట్ ఈజ్...

నాన్న సినిమా చూస్తూ అకిరా ఏం చేశాడో చూడండి.. దట్ ఈజ్ పవర్ స్టార్ కొడుకు.. కెవ్వు కేక..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ కి సంబంధించిన వార్తలు ఆయనకు సంబంధించిన పిక్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉంటున్నాం. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ..ఆయన ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోవడం .. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ ను పొగిడేయడం ..ఆయనను మీట్ అవడానికి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అకిరాను కూడా తీసుకెళ్లడం..

చాలా చాలా హైలెట్ గా మారింది. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు పవన్ ఎక్కడికి వెళుతున్నా సరే తన వెంట కూడా తన కొడుకు అకిరాను తీసుకెళ్తూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా మారిపోయింది . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తమ్ముడు సినిమా రీ రిలీజ్ అయింది . ఈ సినిమా రి రిలీజ్ అయిన థియేటర్లో సందడి చేశాడు అకీరానందన్ . అకిరా ని చూడగానే అక్కడ పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా అంతా కాదు .

అంతే కాదు ఆకీరా ఆనందం కూడా ఓ రేంజ్ లో ఉండింది. నాన్న సినిమాను చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడు. తమ్ముడు సినిమాలోని కొన్ని డైలాగ్స్ వస్తున్నప్పుడు ఆఖీరానందన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అచ్చం నాన్న లాంటి కటౌట్ తో దిగిపోయిన అకిరానందన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ త్వరలోనే అక్కిరానందన్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news