Moviesఆ విషయాని అంత పచ్చిగా బోల్డ్ గా చెప్పేసిన కృతి శెట్టి.....

ఆ విషయాని అంత పచ్చిగా బోల్డ్ గా చెప్పేసిన కృతి శెట్టి.. ఈ కన్నడ పిల్లకి ధైర్యం ఎక్కువే..!

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలాలు దాటిపోయిన ..అలాంటి రోల్స్ లో నటించాలి అనే కోరిక తీరకపోవచ్చు. తాజాగా లాంటి కోరికను బయటపెట్టింది కృతి శెట్టి . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయం అయింది.

ఆ తర్వాత తనదైన స్టైల్ లో దున్నేస్తుంది. అయితే ప్రజెంట్ తెలుగులో కన్నా తమిళ్ – మలయాళం భాషల్లో ఎక్కువ క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మనమే సినిమా ద్వారా జనాలను పలకరించబోతుంది . శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా మనమే సినిమా రిలీజ్ కాబోతుంది . జూన్ 7వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది . కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కృటి శెట్టి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ..”తనకు ఫుల్ టు ఫుల్ యాక్షన్ జోనర్ లో ఉండే సినిమాల్లో నటించాలని ఉంది అన్న విషయాన్ని బయట పెట్టింది”..” హీరోయిన్గా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను ..కానీ మనసుకు నచ్చాలి నా మనసులో ఎక్కువగా ఉండే కోరిక యాక్షన్ సినిమాల్లో నటించడం “అంటూ చెప్పుకొచ్చింది . అయితే కృటి శెట్టి కామెంట్స్ పై జనాలు భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. నీ ఫేస్ కి నీ బాడీ కట్ అవుట్ కి యాక్షన్ సినిమాలు సూట్ అవ్వవు అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news