Movies"కల్కి" పబ్లిక్ టాక్: అశ్విని దత్ 600 కోట్లు పెట్టిన.. సినిమాకి...

“కల్కి” పబ్లిక్ టాక్: అశ్విని దత్ 600 కోట్లు పెట్టిన.. సినిమాకి అదే బిగ్ మైనస్..!

కల్కి.. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పూర్తి రివ్యూ బయటకు వచ్చేసింది.. టాక్ అయితే అద్దిరిపోయే రేంజ్ లో ఉంది . మరి ముఖ్యంగా నాగ్ అశ్వీన్ డైరెక్షన్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది అంటున్నారు జనాలు .

అంతేకాదు చాలా కొత్త కాన్సెప్ట్ ని చూస్ చేసుకున్నారు అంటూ కూడా పొగిడేస్తున్నారు. అయితే పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఈ సినిమాలో కేవలం ఒకటిన్నర గంట మాత్రమే కనిపిస్తూ ఉండడం ఫ్యాన్స్ కు హర్టింగ్గా అనిపిస్తుంది . అంతేకాదు సినిమా స్టార్ట్ అయిన చాలా టైం గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇంట్రడక్షన్ ఉండడం కూడా ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా మారింది .

సినిమాలో హీరో అంటే ప్రభాసే .. భైరవ పాత్ర కీలకం.. మిగతా చాలామంది స్టార్స్ క్యాస్ట్ అండ్ క్రూ పెట్టిన ప్రభాస్ కి ఇచ్చే టైమింగ్ వాల్యూ మాత్రం ప్రభాస్కి ఇవ్వాల్సిందే. అయితే నాగ్ అశ్వీన్ మాత్రం ప్రభాస్ ఎంట్రీ విషయంలో తీసుకున్నంత కాన్సన్ట్రేషన్ టైం గ్యాప్ విషయంలో తీసుకోలేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా కోట్లు ఖర్చుపెట్టిన సరే ఈ సినిమాకి బాహుబలి రేంజ్ టాక్ రాకపోవడం గమనార్హం. కల్కి పై పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం సినిమాకి ఇబ్బందికరంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news