Movies"కల్కి" మూవీ పబ్లిక్ రివ్యూ: ఆ సీన్ వచ్చినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుని...

“కల్కి” మూవీ పబ్లిక్ రివ్యూ: ఆ సీన్ వచ్చినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుని డ్యాన్స్ చేస్తాయ్.. దట్ ఈజ్ ఉప్పలపాటి ప్రభాస్ రేంజ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని .. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో నటించిన సినిమానే కల్కి 2898 ఏడి . పురాణాలను లింక్ చేస్తూ ఆధునిక ప్రపంచం ఎలా ఉండబోతుంది ..? అనే విధానాన్ని టెక్నాలజీ ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేశాడు నాగ్ అశ్వీన్. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . కాగా సినిమాకి సంబంధించిన టాక్ బాగా ట్రెండ్ అవుతుంది.

నాగ్ అశ్విన్ చూపించిన తీరు .. అదే విధంగా ప్రభాస్ నటించిన విధానం ..ఫాన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. అంతేకాదు హిందూ పురాణం మహాభారతంలోని కొన్ని అంశాలని కలియుగానికి కనెక్ట్ చేస్తూ కల్కిగా అవతరించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలను నాగ్ అశ్వీన్ తన విజన్ తో ఈ చిత్రాన్ని చూపించారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్ గా మారాయి వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ .

కాగా ఈ సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ వేరే లెవెల్ అని బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పే డైలాగ్స్ కూడా హైలెట్ గా ఉంటాయి అని ..ఈ సినిమాలో బుజ్జి భైరవ రిలేషన్షిప్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా కామెడీగా ఆహ్లాదకరంగా ఉంటుంది అని ఫాన్స్ చెబుతున్నారు . అంతేకాదు ప్రభాస్ ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు థియేటర్స్ లో రెబల్ ఫ్యాన్స్ అరుపులకి రీ సౌండ్స్ వచ్చేస్తున్నాయి అని ..

అస్సలు కుర్చీల్లో కూర్చోకుండా రచ్చ రంబోలా చేసేస్తున్నారు అని ..దట్ ఇస్ ప్రభాస్ రేంజ్ అంటూ హై లెవెల్ లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా టాక్ చూస్తుంటే వెయ్యి బాహుబలిల సినిమాలకి మించిన రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వబోతుంది అంటూ క్లారిటీ వచ్చేస్తుంది . సోషల్ మీడియాలో ప్రభాస్ నటించిన ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం మరి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news