Movies"కల్కి" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ..ప్రభాస్ కోసం చాలా కాలం...

“కల్కి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ..ప్రభాస్ కోసం చాలా కాలం తర్వాత అలాంటి పని చేసిన అనుష్క..!?

పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే. మొదటి రోజు ఏకంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సినీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన అతిపెద్ద మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది .

ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో అనుష్క ఏకంగా ప్రభాస్ ఇంటికి వెళ్లి మరి విష్ చేసిందట. అనుష్క డైరెక్ట్ గా ప్రభాస్ ని మిట్ అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అయితే సినిమా ప్రమోషన్స్ లేదంటే లేదు వీళ్ళు పర్సనల్ గా మీట్ అయిన సందర్భాలు చాలా రేర్ .బిల్లా సినిమా టైంలో సినిమా సక్సెస్ అయిన తర్వాత స్పెషల్గా విష్ చేసిందట అనుష్క. ఆ తర్వాత బాహుబలి టైంలో విష్ చేసిందట . ఇప్పుడు కల్కి సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో అనుష్క ప్రభాస్ ని స్వయంగా వెళ్ళి మరి విష్ చేసింది అన్న వార్త సినీ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

కాగా వీళ్లు ప్రేమించుకుంటున్నారని..పెళ్లి చేసుకోబోతున్నారని..ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. కానీ వీళ్లు మాత్రం ఆ విషయం పై అస్సలు పాజిటివ్ గా స్పందించడం లేదు. మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్పిస్తే ఇంకేమి లేదు అంటున్నారు. చూద్దాం ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news