Movies"కల్కి"@ 3 డేస్ కలెక్షన్స్: బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన ప్రభాస్.. వెయ్యి...

“కల్కి”@ 3 డేస్ కలెక్షన్స్: బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన ప్రభాస్.. వెయ్యి కోట్ల దిశగా పరుగులు..!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఎంతో ప్రయోగాత్మకంగా నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమా విషయంలో నాగ్ అశ్వీన్ తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు సినిమాకే హైలైట్ గా మారాయి . మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ హైలెట్గా మారింది. ఎవరికి ఇచ్చిన పాత్రల్లో వాళ్ళు బాగా నటించారు .

అమితాబచ్చన్ అయితే ఈ సినిమాకే హైలెట్ గా మారాడు అని చెప్పాలి . కాగా మొదటి రోజు ఏకంగా 180 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ పరంగా కొంచెం తగ్గినట్టు అనిపించింది . అయితే మూడవరోజు మాత్రం బీభత్సంగా కలెక్షన్స్ సాధించేసింది. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మూడవ రోజు మంచి కలెక్షన్స్ ఏ సాధించింది . ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో 20 కోట్లకు మేర వసూలు షేర్ చేసింది .

అంతేకాదు వరల్డ్ వైడ్ గా దాదాపు 65 కోట్ల వరకు రాబట్టి రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల షేర్ తో రికార్డ్ సృష్టించింది. ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపిస్తూ ఉంది.28 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో కూడా సాలిడ్ గా మూడో రోజు రచ్చ చేసింది. ఇదే విధంగా కొనసాగితే కల్కి వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news