Movies"కల్కి 2898AD" ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫిస్ ని షేక్...

“కల్కి 2898AD” ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసి పడేసిన ప్రభాస్..ఆ క్రేజీ రికార్డ్స్ తుక్కు తుక్కు..మొత్తం ఎన్ని వందల కోట్లు అంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “కల్కి”. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకొనే దిశాపటాని హీరోయిన్లుగా నటించారు. అమితాబచ్చన్ – కమలహాసన్ కీలకపాత్రలో కనిపించారు. పురాణాలకు కలయుగ అంతానికి .. కల్కి అవతారానికి మధ్య ఉన్న లింక్ ని చాలా రియలిస్టిక్ గా కళ్ళకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ . ఇది మొత్తం నాగ్ అశ్వీన్ క్రియేటివిటీ అనే చెప్పాలి . నాగ్ అశ్వీన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచమే ఈ కల్కి .

హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోవడమే కాకుండా ఆయనను ఓ రేంజ్ లో ప్రశంసలతో ముంచెత్తారు. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన కల్కి సినిమా ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టే రేంజ్ లో కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . దాదాపు 600 కోట్లకు పైగానే బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది . ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా రావచ్చు అని అభిప్రాయపడ్డారు.

తాజాగా రిలీజ్ అయిన లెక్కల ప్రకారం .. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలోనే ఇది మూడవ అతిపెద్ద ఓపెనింగ్ గా నమోదు చేయబడింది . బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాడు ప్రభాస్ . ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం… నాగ్ అశ్వీన్ తెరక్కించిన ఈ సినిమా మరొక వారం రోజుల్లో ప్రభంజనం సృష్టించబోతుంది అంటూ తెలుస్తుంది . ఇక ఇండియాలో మొదటి రోజు రూ.95 కోట్ల నెట్, రూ.115 కోట్లు గ్రాస్​ వసూళ్లు సాధించినట్లు శచ్నిల్క్ రిపోర్ట్​ తెలిపింది. తెలుగులో రూ.64.5కోట్లు, హిందీలో రూ.24కోట్లు, తమిళంలో 4 కోట్లు,మలయాళంలో 2.2 కోట్లు, కర్ణాటకలో రూ.0.3కోట్లు అని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news