Moviesజూనియర్ ఎన్టీఆర్ వెరీ వెరీ స్పెషల్ రేర్ రికార్డ్ .. కెరియర్...

జూనియర్ ఎన్టీఆర్ వెరీ వెరీ స్పెషల్ రేర్ రికార్డ్ .. కెరియర్ లోని హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మూవీ ఇదే..!

జూనియర్ ఎన్టీఆర్ ..ఏది చేసిన చాలా స్పెషల్ గా ఉంటుంది .. ఏం చేసినా కూడా కరెక్ట్ గానే చేస్తాడు ..డబ్బు అంటే అత్యాశ లేదు.. పెద్దవాళ్ళు అంటే గౌరవం ..చిన్నవాళ్లు అంటే ప్రేమ.. రెస్పెక్ట్ కి మరో మారుపేరనే చెప్పాలి . జూనియర్ ఎన్టీఆర్ ఎలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడో మనందరికీ తెలిసిందే . కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .

ఈ సినిమా కోసం జాన్వి ఎన్టీఆర్ చాలా చాలా కష్టపడుతున్నారు. కొరటాల కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే వార్ 2 కూడా ప్రజెంట్ సెట్స్ పై ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతుంది . ఆగస్టులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హైలెట్ గా మారింది .

ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్లు పుచ్చుకున్నాడట . ఆ తర్వాత దేవర కోసం 100 కోట్లు ఛార్జ్ చేశాడట. అలాగే వార్ 2 సినిమా కోసం కూడా ఆయన 100 కోట్లు చార్జ్ చేశారట . కెరియర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ సినిమా కోసం 130 కోట్లు రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడట ఎన్టీఆర్ . ఇది మేకర్స్ ఆయనకు ఫిక్స్ చేసిన రేట్ అంటూ తెలుస్తుంది . దీంతో ఆయన కెరియర్లో ఎన్టీఆర్ 31 మూవీ చాలా చాలా స్పెషల్గా నిలవబోతోంది అంటున్నారు అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news