ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తన తల్లి ఆనందం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ హిట్ కొట్టిందే లేదు. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అంటే పెళ్లిచూపులు – అర్జున్ రెడ్డి – గీతాగోవిందం – ఖుషి ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
అలాంటి కధలలో నటిస్తేనే జనాలు ఆయనను ఎంకరేజ్ చేస్తున్నారు.. లైక్ చేస్తున్నారు . రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఈ సినిమా భారీ డిజాస్టర్ అందుకుంది . అంతేకాదు ఆయన కెరియర్ లోనే పరమ చెత్త కలెక్షన్స్ నెలకొల్పింది. అయితే ప్రెసెంట్ ఆయన 3 క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయి ఉన్నాడు . ఈ ప్రాజెక్టు కూడా అటు ఇటు అయితే విజయ్ దేవరకొండ కెరియర్ ఇక అయిపోయినట్టే అని చెప్పాలి . ఆ భయమో..లేకపోతే కొడుకు కెరీర్ సెటిల్ చేయాలి అనుకున్నిందో.. విజయ్ తల్లి తీసుకున్న డెసీషన్ ఇప్పుడు సంచలనం గా మారింది.
అందుకే తన తల్లి ఆయన జాతకం చూయించిందట . ఈ క్రమంలోనే పేరులో మార్పులు చేసుకోవాలి అంటూ సజెస్ట్ చేశారట . అలాంటివి నమ్మకపోయినా ఇష్టం లేకపోయినా సరే విజయ్ దేవరకొండ తన తల్లి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట . మొదటి నుంచి తల్లిదండ్రుల మాటలకు రెస్పెక్ట్ ఇచ్చే విజయ్ దేవరకొండ ఇప్పుడు తల్లి ఆనందం కోసం తన పేరును మార్చుకోబోతున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చూద్దాం మరి పేరు మార్చుకున్నాక అయిన విజయ్ హిట్ కొడతాడో లేడో..?