Moviesపవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ అలా చేయబోతుందా..? సినీ చరిత్రలోనే...

పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ అలా చేయబోతుందా..? సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సినీ ప్రముఖులు సినీ పెద్దలు స్పెషల్ గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మారిపోయారు. అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ ముద్దుగా పిలుస్తున్నారు . కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సినీ ప్రముఖులు సినీ పెద్దలు ఆయనకు గ్రాండ్ గా సత్కారం చేయబోతున్నారట .

దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఈ సన్మానాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అన్న విషయం మాత్రం తెలియడం లేదు . మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి దూరం . అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇచ్చిన గ్రాండ్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు. అది ఆయన ఫ్యామిలీ మేటర్ కాబట్టి .. ఇలా పొలిటికల్ పరంగా స్టార్ గా మారిన పవన్ కళ్యాణ్ ను సినీ పెద్దలు సత్కరించాలి అనుకోవడంలో తప్పులేదు .

కానీ దీనిని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు . అందుకే పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అలాంటివి ఏదీ వద్దు అంటున్నారట . కానీ చిరంజీవి రికమండేషన్ తో సినీ ప్రముఖులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గ్రాండ్గా సన్మానం చేయాలి అని డిసైడ్ అయ్యారట . ఇందుకోసం టాలీవుడ్ సినీ బడా ప్రొడ్యూసర్స్ ..డైరెక్టర్స్ కూడా భాగం కాబోతున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news