Movies"కల్కి" సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ ఇచ్చిన...

“కల్కి” సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ ఇచ్చిన ఆ ఒక్క ఐడియా నేనా ..? ఫేట్ అలా మార్చేసిందా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా టాక్ ఆఫ్ ఇండియా గా మారిపోయింది . ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు . ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా కూడా నాగ్ అశ్వీన్ అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు ప్రభాస్ . చాలామంది నటీనటులను ఈ సినిమాలో తీసుకున్నాడు నాగ్ అశ్వీన్.

కాగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఒకే ఒక్క క్లైమాక్స్ అని మాత్రం మనం మర్చిపోకూడదు . సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ మాత్రమే మరొక ఎత్తు .. ప్రభాస్ వైపు మొత్తం కథను టర్న్ చేసేలా చేసింది . నిజానికి ఈ ఐడియా ఇచ్చింది ప్రభాస్ నే అంటూ తెలుస్తుంది . షూటింగ్ ప్రాసెస్ లో క్లైమాక్స్ మంచి హై మూమెంట్ కావాలి అంటూ పురాణాలతో లింక్ చేస్తే ఇక హైప్ వస్తుందేమో అంటూ ప్రభాస్ దర్శకుడికి సలహా ఇచ్చాడట .

అసలు అంతవరకు కర్ణుడి ఆలోచనకే రాలేదట. అశ్వద్ధామకు మరణం లేదని .. కలియుగం వరకు తనకు శాప విమోచన లేదని.. కల్కి అవతరించాకే తనకు విముక్తి అని పురాణాలు చెబుతున్నాయి . అయితే కర్ణుడి ప్రస్తావన ఎక్కడా లేకపోయినప్పటికీ ప్రభాస్ ఇచ్చిన ఒకే ఒక్క ఐడియాతో క్లైమాక్స్ ను బాగా మలుపు తిప్పాడు నాగ్ అశ్వీన్.. ఈ సినిమాకి కల్కి అనే పేరు పెట్టడానికి కూడా కారణం ప్రభాసే అంటూ తెలుస్తుంది. ఇలా ప్రభాస్ ఇచ్చిన ఒక్క ఐడియా కల్కి సినిమా చరిత్రను తిరగరాసేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news