Moviesశోభన పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఆ హీరోనా..? అంత గబ్బు...

శోభన పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఆ హీరోనా..? అంత గబ్బు పనులు చేశాడా..?

శోభన .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ రాజ్యమేలేస్తున్న మూమెంట్లో శోభన కూడా తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఎలాంటి మంచి సినిమాలో నటించిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో చాలా చక్కగా నటించి క్రేజీ క్రేజీ ఆఫర్స్ అందుకొని అభిమానులను సంపాదించుకుంది . శోభన నటించిన సినిమాలు ఎంత చక్కగా ఉంటాయో అంటూ అప్పట్లో మాట్లాడుకునే వాళ్ళు.

చిన్నప్పటి నుంచే ఆమె డాన్స్ ఎక్కువగా నేర్చుకున్నారు . క్లాసికల్ డాన్సర్.. క్లాసికల్ డాన్స్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు .. చిన్నప్పటినుంచి ఆమెకు అలవాటు ఉంది.. నాట్యకారినిగా రాణిస్తూనే సినిమాలోకి వచ్చారు. ఇండస్ట్రీని తన అంద చందాలతో ఊపేశారు . అప్పట్లో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ . శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఒక రీజన్ ఉంది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె ఓ హీరో ని గాఢంగా ప్రేమించిందట . ఆ హీరో కూడా ఆమెని గాఢంగా ప్రేమించారట . వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ ఆ హీరో ఈమెను ప్రేమించినట్లే ప్రేమించి మోసం చేసి వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడట .

దీంతో ప్రేమలో మోసపోయిన శోభన మరోసారి ప్రేమ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడిందట . తను నమ్మే క్లాసికల్ డాన్స్ ని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చిందట. అంతేకాదు ఆ వ్యక్తి మోసం చేశాక శోభన సంచలన నిర్ణయం తీసుకుందట . తను మ్యారేజ్ చేసుకోకూడదు అంటూ అప్పట్లోనే డిసైడ్ అయిందట . ఐదు పదుల వయసు దాటిన ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తనకాళ్ల పై తానే నిలబడి తన పనులు తానే చేసుకుంటుంది శోభన.

మొదటి నుంచి చాలా చాలా స్ట్రిక్ట్ పర్సన్ . ఒక్కసారి ఏదైనా నమ్మి మోసపోయిందా ..? ఇక లైఫ్ లో మళ్ళీ వాటిని దగ్గర చేర్చడం లాంటివి చేయద్దు. అలాంటి ఓ రేర్ క్వాలిటీ ఉన్న అమ్మాయి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శోభన పలు సినిమాల్లో నటించింది . ఇప్పటికీ ఆఫర్స్ వస్తున్న సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . తనకి కథ నచ్చితేనే ఆ సినిమాలో ఓకే చేస్తుంది. కాగా పెళ్లి చేసుకోకపోయినా ఓ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటుంది శోభన..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news