Moviesబన్నీ కెరీర్ ని కాపాడడానికి సుకుమార్ అలా చేయబోతున్నాడా..? పెద్ద రిస్కే...

బన్నీ కెరీర్ ని కాపాడడానికి సుకుమార్ అలా చేయబోతున్నాడా..? పెద్ద రిస్కే చేస్తున్నాడా..?

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది” అన్న సామెతలా తయారైంది.. ఇప్పుడు సుకుమార్ పరిస్థితి . మెగా ఫ్యాన్స్ – అల్లు ఫ్యాన్స్ కొట్టుకొని చస్తూ.. పుష్ప2కు భారీ బొక్క పెట్టేలా ఉన్నారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడటంతో సుకుమార్ కి పెద్ద హెడ్ ఏక్ గా మారింది . తన లైఫ్ మొత్తం శాక్రిఫైజ్ చేసి పుష్ప2 సినిమా కోసం కష్టపడుతూ ఉంటే లాస్ట్ మినిట్లో ఇప్పుడు పుష్ప2 ని అడ్డుకుంటాం ..పుష్ప2 ని ఫ్లాప్ చేస్తాం అని.. కొందరు మెగా ఫాన్స్ ఓపెన్గా చెప్పుకొస్తూ ఉండడం సుకుమార్ కి కష్టాలు కొనితెచ్చిన పరిస్థితి అయింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయ్ .. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టింది మైత్రి మూవీ మేకర్స్ . అంతేకాదు ఈ సినిమా కోసం సుకుమార్ తన జీవితాన్ని త్యాగం చేశాడు .. చాలా చాలా కష్టపడ్డాడు .. అయితే ఇన్నాళ్లు కష్టపడి ఫైనల్లీ రిలీజ్ మూమెంట్ నాడు జనాలు పుష్ప2ని అడ్డుకుంటామని చెప్పడం సుకుమార్ కు పెద్ద తలనొప్పిగా మారింది .

బన్నీ వైసిపి కాండిడేట్ కి సపోర్ట్ చేయడం జనసేన నేతలు తట్టుకోలేకపోయారు.. పైగా మెగా ఫ్యామిలీ కూడా అల్లు ఫ్యామిలినీ దూరం పెట్టేసింది . దీంతో పుష్ప2ను అడ్డుకుంటామంటున్నారు మెగా ఫాన్స్.. ఓపెన్ గానే సినిమా ఫ్లాప్ అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ఈ వేడి తగ్గే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యారట. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ కి మూవ్ చేసిన్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హైలెట్గా మారింది. బన్నీ కెరియర్ కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నాడు అంటున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news