Moviesకల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ఆ"లేడీ"ని రంగంలోకి దింపుతున్న ప్రభాస్.. మరో...

కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ఆ”లేడీ”ని రంగంలోకి దింపుతున్న ప్రభాస్.. మరో తప్పు చేస్తున్నాడా..?

ఈ మధ్యకాలంలో సినిమాను తెరకెక్కించడం కాదు .. ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం .. ఆ సినిమా ప్రమోషన్స్ లో స్టార్స్ ని రంగంలోకి దించడం ..చాలా చాలా కామన్ గా చూస్తున్నాం . ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి చీఫ్ గెస్ట్లుగా పిలవడం .. అదే విధంగా తమ ఫేవరెట్ హీరోస్ హీరోయిన్స్ లేదా ఫ్రెండ్స్ ను చాలా హైలెట్ చేస్తూ ప్రమోషన్స్ లో యాడ్ చేయడం లాంటివి చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రభాస్ సైతం అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ప్రభాస్ అన్న విషయం గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాగా కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ చాలా హై రేంజ్ లో ప్లాన్ చేశారు మేకర్స్ .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఫేవరెట్ బ్యూటీ అనుష్క శెట్టిని రంగంలోకి దింపబోతున్నారట. అనుష్క శెట్టితో స్పెషల్ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారట .ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ – దిశా పటాని -నాగ్ అశ్వీన్ – అనుష్క శెట్టి – రాజమౌళి కూడా యాడ్ కాబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఫైనల్లీ ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ కోసం పర్సనల్ రూమర్స్ ని కూడా బాగానే వాడేసుకుంటున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news