Moviesఎంత ట్రై చేసిన ఆ విషయంలో.. నాగ్ అశ్వీన్ రాజమౌళి కాలి...

ఎంత ట్రై చేసిన ఆ విషయంలో.. నాగ్ అశ్వీన్ రాజమౌళి కాలి గోటికి కూడా సరిపోడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఓపెన్ గా మాట్లాడడం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పలువురు హీరోల ఫ్యాన్స్ ఎలా పోట్లాడుకుంటూ ఉంటారో .. సోషల్ మీడియాలో వార్ చేసుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే . అయితే తాజాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రాజమౌళి డైరెక్టర్ నాగ్ అశ్వీన్ పేర్లు హైలెట్గా మారాయి . మరీ ముఖ్యంగా నాగ్ అశ్విని ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాడు .

ప్రభాస్ తో కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు జూన్ 27వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కోసం నాగ్ అశ్వీన్ బాగానే కష్టపడ్డాడు.. బుజ్జి అంటూ సరికొత్త అడ్వెంచర్స్ వెహికల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు . ఇప్పటికే రిలీజ్ అయిన రెండో ట్రైలర్ కూడా సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. అయితే అన్ని విషయాలలో పకడ్బందీగా ఉన్న నాగ్ అశ్వీన్ రాజమౌళిని బీట్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు.

కానీ ఎంత ట్రై చేసినా కూడా రాజమౌళి కాలి గోటికి కూడా సరిపోడు అంటూ రాజమౌళి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ ట్రైలర్ చూస్తే బాహుబలి సినిమాకి మించిన ఎలివేషన్స్ క్రియేట్ చేశాడు.. అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం నాగ్ అశ్వీన్.. రాజమౌళి స్టాండర్డ్స్ ను అందుకోలేకపోయాడు . రాజమౌళి ఒక పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తారు .

కానీ నాగ్ అశ్వీన్ ఆ విషయంలో వెనుక పడ్డాడు . తెలుగులో ఆయన సరిగ్గా ప్రమోషన్స్ చేసిందే లేదు . చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టి ఆయన సినిమాకి డప్పు కొట్టుకుంటున్నారు తప్పిస్తే ఎక్కడ సినిమాలోని ఒరిజినల్ కంటెంట్ను ఎలివేట్ చేస్తూ భారీ హైప్ ఇచ్చే విధంగా ప్రమోషన్స్ నిర్వహించడం లేదు . కంటెంట్ బాగుంటే ప్రమోషన్స్ అవసరం లేదు అనుకున్నాడో లేకపోతే ఆయనకు ప్రమోషన్స్ సరిగ్గా చేయడం రాలేదో.. మొత్తానికి రాజమౌళి అభిమానుల చేత మాత్రం హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news