Moviesఆ భాషలో "కల్కి: అట్టర్ ప్లాప్ ..మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్...

ఆ భాషలో “కల్కి: అట్టర్ ప్లాప్ ..మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా..? పరమ చెత్త కలెక్షన్స్..!

ప్రభాస్ నటించిన కల్కి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తెలుగు హీరో కాబట్టి తెలుగులో బాగా పాపులారిటీ ఉంది కాబట్టి తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టగలిగింది . కానీ మిగతా భాషల్లో ప్రభాస్ నటించిన కల్కి సినిమా కూసింత డిసప్పాయింట్మెంట్ చేసే విధంగానే కలెక్షన్స్ అందుకుంది. మనకు తెలిసిందే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అయితే కల్కి సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ తమిళం – మలయాళం లో మాత్రం దారుణాతి దారుణమైన టాక్ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా సింగిల్ డిజిట్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. ఇండియాలో రూ.95 కోట్లు రాగా వాటిలో ఒక తెలుగులో రూ. 64.5 కోట్లు వచ్చాయి. అలాగే తమిళంలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 24 కోట్లు, మలయాళంలో రూ. 2.2 కోట్లను కల్కి 2898 ఏడీ సినిమా రాబట్టింది.

తమిళంలో ఈ సినిమా మరి దారుణంగా 4 కోట్లు కలెక్ట్ చేయడం షాకింగ్ గా ఉంది. ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించారు..కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. బహుశా ఈ సినిమాకి తమిళంలో నాగీ ఎక్కువ ప్రమోషన్స్ నిర్వహించక పోవడమే కారణం కావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news