మెగా – అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . గతంలో సినిమాలపరంగా ఎన్నెన్నో ఇష్యూస్ వచ్చేటివి ..ఎన్నెన్నో మాటలు కూడా ట్రోల్ అయ్యేటివి. అయితే అవంతా చాలా లైట్ గా తీసుకునేవారు ఫ్యాన్స్ . కానీ ఫర్ ద ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీనే అల్లు ఫ్యామిలిని దూరం పెట్టింది అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు .
ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా తనదైన స్టైల్ లో స్ట్రాటజీలను ఉపయోగించి ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా చేశాడు . వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి భారీ వెల్కమ్ చెప్పారు . గ్రాండ్ గా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తున్న వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ మెగా సెలబ్రేషన్స్లో ఎక్కడా కూడా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కరు అంటే ఒక్కరు కూడా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా మెగా ఫ్యామిలీలో ఏ చిన్న పండగ జరిగిన సరే అల్లు అరవింద్ వాలిపోతాడు .
కానీ ఇంత పెద్ద గ్రాండ్ వెల్కమ్ చెబుతూ అంత పెద్ద సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తూ ఉంటే అల్లు అరవింద్ గాని అల్లు అర్జున్ కానీ కనిపించకపోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టేలా చేస్తుంది. చాలామంది గతంలో బన్నీ వైసీపీ కాండిడేట్ కు సపోర్ట్ చేయడం మెగా ఫ్యామిలీకి నచ్చలేదు అంటూ ట్రోల్ చేశారు. మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబాన్ని దూరం పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు . బహుశా మెగా ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కూడా అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయానికి బాగా హర్ట్ అయినట్లు ఉన్నారు అని.. అందుకే అల్లు ఫ్యామిలీని దూరం పెట్టి మాది మా మెగా ఫ్యామిలీ అన్న రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు .మొత్తానికి అల్లు అర్జున్ తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం ఇప్పుడు ఆయన లైఫ్ని రిస్క్ లో పెట్టేలా చేసింది..!!